ఒక దశ ముగిసిన రోజు అది.. నాటి జ్ఞాపకాల్లో నమ్రత శిరోద్కర్

నమ్రత శిరోద్కర్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మహేష్ బాబు సతీమణిగానే కాకుండా.. బాలీవుడ్, టాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే నమ్రత కెరీర్‌లో స్టార్ స్టేటస్ సొంతం చేసుకోకముందే సినీ కెరీర్‌కు పుల్ స్టాప్ పెట్టేసింది. పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు దూరమైంది. అయితే పెళ్లికి ముందు చివరగా నటించిన చిత్రం, ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లాస్ట్ వర్కింగ్ డేన తలుచుకుంది నమత్ర.

మోడలింగ్ కెరీర్‌ నుంచి, మిస్ ఇండియా వరకు ఎదిగింది నమ్రత. ఆపై బాలీవుడ్‌లో మొదటగా సక్సెస్ కోసం ప్రయత్నించింది. వాస్తవ్ సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఆపై 2000వ సంవత్సరంలో తెలుగులో వంశీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా సమయంలో మహేష్-నమత్ర ప్రేమలో పడ్డారు. చివరగా 2005లో వివాహా బందంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లికి ముందు తాను అంగీకరించిన అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే సినిమాలకు స్వస్థి చెప్పింది.

 Namrata Shirodkar Recalled Bride And Prejudice Memories

సినీ కెరీర్‌కూ టాటా చెప్పిన నాటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. 'ఇది నాకెంతో ప్రత్యేకం. బ్రైడ్ అండ్ ప్రిజూడిస్ నా చివరి చిత్రం.. అంతేకాకుండా ఇది లాస్ట్ డే దిగిన ఫోటో. మా సినిమా షూటింగ్ పూర్తయింది. అంతే కాకుండా నా జీవితంలో దశ ముగిసింది. పెళ్లి చేసుకోవాడికి రెడీ అయ్యాను. మూడు నెలలు లండన్‌లో చిత్రయూనిట్‌తో ఎంతో సరదాగా గడిపాను. అందులో ఎన్నో జ్ఞాపకాలున్నాయ్..ఈ ఫోటోను షేర్ చేసినందుకు సంతోష్ శివన్ గారికి ధన్యవాదాలు' అని నమ్రత నాటి విషయాలను తలుచుకుంటూ ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X