‘మహేశ్‌తో పెళ్లికి వాళ్లు ఒప్పుకోలేదు.. గౌతమ్ పుట్టిన తర్వాత అలా విడిపోయాం’
అందానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన నమ్రతా శిరోద్కర్‌ను 1993 సంవత్సరంలో మిస్ ఇండియా ఫెమినా కిరీటం వరించింది. ఆ తర్వాత జబ్ ప్యార్ కైసే హోతా హై సినిమా తర్వాత ఆమె హిందీ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం 2000 సంవత్సరంలో వంశీ సినిమా కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. అయితే తన జీవితంలో జరిగిన విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె చెప్పిన ఆసక్తికరమైన వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా రంగంలో తొలి సినిమా వంశీ. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిగా న్యూజిలాండ్‌లో జరిగింది. సుమారుగా 52 రోజులపాటు షెడ్యూల్‌తో సుదీర్గంగా షూటింగ్ సాగింది. ఆ సందర్భంలో జరిగిన పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. అయితే వారిద్దరి లవ్ అఫైర్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త తీసుకొన్నారు. చాలాకాలం చాటుమాటుగా ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించిన తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు.

అయితే మా ఇద్దరి వివాహం గురించి మహేష్ కుటుంబం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే, మహేష్ కంటే నేను 4 ఏళ్లు వయసులో పెద్ద కావడమే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హీరోయిన్లను పెళ్లి చేసుకొంటే కొన్ని సమస్యలు వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి అడ్డంకులను ఎదుర్కొని చివరకు 2005 సంవత్సరంలో పెళ్లి చేసుకొన్నాయి అని నమ్రతా శిరోద్కర్ చెప్పారు.
పెళ్లికి ముందే మహేష్ బాబు నాతో ఓ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నాకు వర్కింగ్ వైఫ్ ఇష్టం ఉండదు. నాతో వివాహం చేసుకొంటే కెరీర్‌ను పూర్తిగా పక్కన పెట్టేయాల్సిందే అని అన్నారు. దాంతో నాకు టాప్ హీరోయిన్ కావాలనే కోరిక కూడా లేకపోవడంతో నా కెరీర్‌ను ముగించడానికి సిద్దమయ్యాను. మహేష్ కోసం నేను నా ప్రొఫెషనల్ లైఫ్‌ను త్యాగం చేశాను అని నమత్రా వెల్లడించారు.

ముంబైలో మహేష్ బాబుతో పెళ్లికి ముందు నేను ఫ్లాట్‌లో ఉండటం అలవాటు. కానీ మ్యారేజ్ తర్వాత హైదరాబాద్‌లో పెద్ద బంగ్లాలో ఉండాల్సి వచ్చింది. దాంతో నేను కొంత ఇబ్బంది పడ్డాను. నా కోరిక మేరకు నేను మహేష్ ముంబైకి షిఫ్ట్ అయ్యాం. నా బాధను అర్దం చేసుకొని ఆయన ఫ్లాట్‌లో ఉండేందుకు అంగీకరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు హైదరాబాద్‌కు మకాం మార్చి ఫ్లాట్‌లో ఉన్నాం అని నమత్ర చెప్పారు.
పెళ్లి తర్వాత కొద్ది సంవత్సరాల అనంతరం మాకు గౌతమ్ పుట్టాడు. ఆ సమయంలో మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చాయి. నా తల్లిదండ్రులిద్దరు చనిపోవడం వల్ల డిప్రెషన్‌కు లోనయ్యా. మహేష్‌కు కెరీర్ పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో మేము కొంత కాలంగా ఒకరికొకరం దూరంగా ఉన్నాం. దాంతో మేము విడిపోయామని మీడియాలో రూమర్లు వచ్చాయి. ఆ కాలం అత్యంత గడ్డు పరిస్థితి అని గుర్తు చేసుకొని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత మేమిద్దరి కలిసి జీవించాం. ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోవడంతో మళ్లీ ఎలాంటి సమస్యలు తలెత్తలేదు అని అన్నారు. గతంలో ఇచ్చిన నమ్రత ఇంటర్వ్యూను మరోసారి మాతృభూమి వెబ్ సైట్ ప్రత్యేకంగా ప్రచురించింది.


Click it and Unblock the Notifications











