బాలకృష్ణ సెన్సేషనల్ డెసీషన్: వాళ్ల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి ముందుకెళ్తున్న నటసింహాం.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఏడాది ఒక సినిమా చేయడం కష్టం అవుతోంది. వాళ్ల స్టార్‌డమ్‌కు తగ్గట్లు కథలు వెదకడం.. అన్నీ సెట్ అయి పట్టాలెక్కడం.. సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకోవడం వంటి కారణాల వల్ల సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. అయితే, జయాపజయాతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన ఈ స్టార్ హీరో... తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా డేరింగ్ డెసీషన్ తీసుకున్నారట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది
నందమూరి బాలకృష్ణకు 2019వ సంవత్సరం అస్సలు కలిసి రాలేదు. గత ఏడాది ఆయన మూడు సినిమాల (యన్.టి.ఆర్ బయోపిక్ రెండు భాగాలతో పాటు ‘రూలర్')తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూడూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఫలితంగా ఆయనకు పోయిన సంవత్సరం నిరాశే ఎదురైంది. బయోపిక్ వల్ల నష్టాలను కూడా ఎదుర్కొన్నారు.

పక్కాగా హిట్ కొట్టాలని పెద్ద ప్లాన్
వరుస పరాజయాలతో సతమతమవుతోన్న బాలకృష్ణ.. ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలని పెద్ద ప్లానే వేశారు. ఇందులో భాగంగానే ఆయన తనకు రెండు భారీ హిట్లు (సింహా, లెజెండ్) అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిశారు. సక్సెస్‌ఫుల్ జోడీగా పేరొందిన ఈ ఇద్దరి కాంబోలో మూడో సినిమా ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

అసలు ఈ సినిమా పూర్తవుతుందా?
వాస్తవానికి బోయపాటి శ్రీనుతో బాలయ్య మూడో సినిమా ఎప్పుడో చేయాల్సి ఉంది. అయితే, కథలో కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో దానిని పక్కన పెట్టేసి ‘రూలర్' పూర్తి చేశాడు. ఇక, ఇప్పుడు ఖాళీ అవడంతో బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌కు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఫలితంగా చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది.

సినిమాకు హైలైట్.. హాట్ టాపిక్ ఇదే
ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే ప్రతి ఒక్కరిలోనూ అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఏదో ఒక న్యూస్ లీక్ అవుతూనే ఉంది. ఇందులో బాలయ్య డుయల్ రోల్ చేస్తున్నాడట. అందులోనూ ఒకటి అఘోరా లుక్ అని అంటున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

వాళ్ల కోసం బాలకృష్ణ సెన్సేషనల్ డెసీషన్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి నందమూరి బాలకృష్ణ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, బాలయ్య మాత్రం తన సినిమా షూటింగ్ మాత్రం కొనసాగించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
Recommended Video

వాళ్ల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన నటసింహాం
సినిమా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఎంతో మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన సినిమా షూటింగ్‌ను పక్క రాష్ట్రాల్లో చేయాలని ఆయన చిత్ర యూనిట్‌కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అదీ వీలు కాకుంటే.. ముందుగా విదేశాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని బోయపాటిని ఒప్పించినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











