Balakrishna - Mokshagna: శ్రీలీల వెంటే మోక్షజ్ఞ .. అసలు విషయం ఏంటి?

బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఇక ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రబృందం. అయితే ఈ మధ్య ఎక్కడ చూసిన మోక్షజ్ఞ.. శ్రీలీల వెంట ఉన్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరో ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే అసలు ఈ ఫోటో వెనుక అసలు స్టోరీ ఏంటి.. అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నందమూరి బాలయ్య థియేటర్లో గర్జించడానికి భగవంత్ కేసరి సినిమాతో వస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తుంది. ఇక కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఈ సినిమా జరుపుకుంది. అంతేకాదు.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. అందులో బాలయ్య డైలాగ్స్, యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.

Nandamuri Balayya, Mokshagna and Sreeleela Photo Viral as As part of Bhagavanth Kesari Movie promotions

ఇక బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంటులో శ్రీలీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీలీల తనను చిచ్చ చిచ్చ అంటూ సవగొట్టిందని... ఇక నెక్ట్స్ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేద్దాం అనుకున్నారట బాలయ్య. అయితే ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెబితే... మోక్షజ్ఞ ఎంటర్ అయి... గ్రౌండ్ ఫ్లోర్ బలసిందా డాడీ అంటూ వార్నింగ్ ఇచ్చారని బాలయ్యే స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంటులో చెప్పుకువచ్చారు. నేను కుర్ర హీరోను టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాను... మీరు ఆమెతో కలిసి నటిస్తారా అంటూ మోక్షజ్ఞ తండ్రికి వార్నింగ్ ఇచ్చాడట.

Nandamuri Balayya, Mokshagna and Sreeleela Photo Viral as As part of Bhagavanth Kesari Movie promotions

అయితే ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా బాలయ్య, మోక్షజ్ఞ, శ్రీలీల ఫోటో వైరల్ గా మారింది. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫోటో దిగారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్స్ మాత్రం.. శ్రీలీలను మోక్షజ్ఞ వదలడం లేదుగా అంటున్నారు. శ్రీలీల ఎక్కడ ఉంటే.. అక్కడే మోక్షజ్ఞ ఉంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకు ముందు కూడా భగవంత్ కేసరి సెట్స్ లో మోక్షజ్ఞ కనిపించాడు. అప్పుడు కూడా శ్రీలీల, మోక్షజ్ఞ ఫోటోస్ వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోల్లో మోక్షజ్ఞ లుక్ బాగుంది కూడా. అయితే ఇంకో విషయం ఏంటంటే... ఈ సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. అది కూడా శ్రీలీలను పెళ్లి చేసుకునే క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తుంది. సినిమా చివరిలో శ్రీలీలకు కాబోయే భర్తగా మోక్షజ్ఞ ఓ స్పెషల్ రోల్ చేశారని సమాచారం. అందుకే ఆయన భగవంత్ కేసరి సెట్ లో కనిపించారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Nandamuri Balayya, Mokshagna and Sreeleela Photo Viral as As part of Bhagavanth Kesari Movie promotions

ఇక మోక్షజ్ఞ ఎంట్రీకి కూడా రంగం సిద్ధం అవుతుంది. ఈయన డెబ్యూ చిత్రాన్ని మొదట బోయపాటి అనుకున్నారు. తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కానీ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కానీ ఓ సినిమా రాబోతుందట. ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ఆదిత్య 999 సినిమాతో ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం సైతం సాగింది. మరి ఇక మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాలో సైతం శ్రీలీల హీరోయిన్ గా చేస్తుందని ఆ మధ్య వార్తలు బయటకు వచ్చాయి. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X