ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లా.. నా కళ్లతో చూశాను.. క్యాస్టింగ్ కౌచ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ కామెంట్స్

ఒక్కోసారి అందం ఎంతున్నా.. అదృష్టం కావాల్సి ఉంటుంది. అదృష్టం తోడు లేకుంటే ఎన్ని అడుగులు వేసినా విజయ తీరాలనే చేరుకోలేము. నందినీ రాయ్ విషయంలో అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. కావాల్సినంత అందం ఉండి కూడా సరైన అవకాశాలు రావడం లేదు. వెండితెరపై అంతగా పేరు తెచ్చుకోలేని ఈ భామ.. బిగ్‌బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది. రెండో సీజన్‌లో తనీష్‌తో నడిపిన రహస్య బంధం అప్పట్లో ఎంతో వైరల్ అయింది. తాజాగా ఈమె 'హలో యాప్' నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలను వెల్లడించింది. అవేంటో ఓ సారి చూద్దాం

వెండితెరపై మెరవని అందం..

వెండితెరపై మెరవని అందం..

నందినీ రాయ్ 2015లో ‘మోసగాళ్లకు మోసగాడు' సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆపై నందినీ రాయ్ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఆపై రెండు మూడేళ్లకు మళ్లీ బిగ్‌బాస్‌లో మెరిసింది. అయితే ఈ గ్యాప్ చాలా సినిమాల్లో అవకాశాలను వదులుకున్నానని చెప్పుకొచ్చింది.

అందుకే వదులుకున్నా..

అందుకే వదులుకున్నా..

అడవి శేష్‘క్షణం' సినిమాకు నందినీ రాయ్‌ను అడిగారట. అయితే అప్పటికే తాను హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లిందంటా. అదా శర్మ క్యారెక్టర్ తనకు ఆఫర్ చేశారని, అయితే తానెంతో పిచ్చిదాన్ని కాకపోయి ఉంటే.. క్షణం లాంటి సినిమాను వదులుకొన్నానని చెప్పుకొచ్చింది.

డిప్రెషన్‌లోకి వెళ్లాను..

డిప్రెషన్‌లోకి వెళ్లాను..

‘మోసగాళ్లకు మోసగాడు' పరాజయం తరువాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. రెండు సంవత్సరాలు మానసికంగా దృఢంగా లేనని పేర్కొంది. ఆ తరవాత తమిళ్ ‘గగనం', కన్నడ ‘గుండెజారి గల్లంతయ్యిందే'లో చేసిన తరవాత బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందని పేర్కొంది.

Recommended Video

Aishwarya Rai Assets More Than Abhishek Bachchan
క్యాస్టింగ్ కౌచ్‌పై..

క్యాస్టింగ్ కౌచ్‌పై..

చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం తనకు ఎప్పుడూ ఎదురవలేదని నందిని చెప్పుకొచ్చింది. వాళ్లను అడిగారు.. వీళ్లను అడిగారు అని ఇండస్ట్రీ గురించి చాలా మంది అంటారని. నిజానికి అలా ఏం ఉండదని తెలిపింది. అడిగేవాళ్లు అడుగుతారు. అంతా అమ్మాయి ఇష్టమేనని చెప్పుకొచ్చింది. ఒక అమ్మాయి వెళ్లాలి అనుకుంటే వెళ్తుంది.. ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే నో చెప్తుందని తెలిపింది. ఎప్పుడూ ఎవరు ఎవరినీ ఫోర్స్ చేయరనీ, తాను కళ్లతో చూశాను కాబట్టి చెబుతున్నానని క్యాస్టింగ్ కౌచ్‌ గురించి చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X