twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్ బ్యూటీ కొత్త ప్రయోగం అదిరిందిగా..

    |

    నటిగా, దర్శకురాలిగా, రైటర్ గా విమర్శకుల ప్రసంశలు సైతం అందుకున్న నందితా దాస్, మరోసారి తన సత్తా చాటుకున్నారు. వివిధ సామాజిక అంశాలపై అర్థవంతమైన చిత్రాలు నిర్మిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన నందిత, ఈసారి లాక్ డౌన్ నేపథ్యంలో మనసుకి హత్తుకునే లఘుచిత్రాన్ని నిర్మించారు.

    మానసిక చిత్రవథ కూడా గృహహింసే....

    మానసిక చిత్రవథ కూడా గృహహింసే....

    లాక్ డౌన్ లో గృహహింస ఫిర్యదులు పెరుగుతున్న నేపథ్యంలో, కథను సిద్ధం చేసుకున్న నందితా కొద్ది పాటి వనరులతోనే అద్భుతమైన సందేశాత్మక లఘు చిత్రాన్ని నిర్మించారు. గృహహింస అనేది కేవలం శారీరికమైనది మాత్రమే కాదు, మానసిక చిత్రవథ కూడా మహిళలను కుంగదీస్తోందని తమ చిత్రం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు.

    ఆమె గోడు వినండి...

    ఆమె గోడు వినండి...

    లిసిన్ టు హర్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ లఘు చిత్రంలో నందితా, ఆమె కుమారుడు కూడా నటించారు. ఇక కథ విషయానికి వస్తే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటోన్న నందితా, ఇంటి పనులు చెక్కబెట్టుకుంటూనే, ఓ వైపు కుమారుడి అవసరాలను, భర్త అవసరాలనూ తీరుస్తూ సమతమతమవుతుంటుంది. ఇంతలో ఆమెకు ఓ ఫోన్ వస్తుంది. భర్త చేతిలో చిత్ర హింసలకు గురవుతున్న ఓ అమ్మాయి తనను రక్షించమంటూ నందితను వేడుకుంటుంది. దీంతో చలించినపోయిన నందిత పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారమిస్తుంది. కానీ, చివర్లో, తానుకూడా గృహసింహ లోనవుతున్నట్లు గ్రహిస్తుంది.

    Recommended Video

    Sri Reddy Negative Facebook Post On HIT Movie And Hero Nani
    మౌనం పరిష్కారం కాదు...

    మౌనం పరిష్కారం కాదు...

    తాను విద్యార్ధి దశ నుంచే ఈ రకమైన గృహసింహ గురించి పరిశీలిస్తున్నట్లు పేర్కొన్న నందితా దాస్, దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉందని వివరించింది. మహిళలు తమ సమస్యలను బహిరంగంగా చర్చించడం ద్వారానే ఈ మానసిక చిత్రవధకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని తెలిపింది. మౌనం దేనికి పరిష్కారం కాదని వెల్లడించింది.

    English summary
    Filmaker Nandita Das is back with a bang. Her latest shortfilm on domestic abuse during lockdown is as impactful as her pervious outings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X