హద్దులు చెరిపేసిన యంగ్ హీరోయిన్… హాట్ సెల్ఫీతో గేలం వేస్తోంది!
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసి టాలీవుడ్ కి పరిచయం అయిన కన్నడ భామ భామ నందితా శ్వేత తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆమె కైపెక్కించే చూపులతో, మైమరిపించే నవ్వుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ భామకు ఇంకా సరైన బ్రేక్ దక్కలేదు.
మరీ హాట్‌గా పార్వతీ నాయర్.. రెచ్చిపోయి ఫోటోషూట్

సినిమాల్లో పద్ధతిగా
అడపాదడపా పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రల్లో మెరిసిన ఈ భామ మంచి హిట్ కొట్టి టాప్ హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఎప్పుడూ సినిమాల్లో పద్ధతిగా కనిపించే ఈ భామ తాజాగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

సోషల్ మీడియాలో వలపు వల
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకున్న నందితా శ్వేతకి ఆ సినిమా హిట్ గా నిలిచినా అనుకున్నంత క్రేజ్ మాత్రం దక్క లేదు. దీంతో హాట్ ఫోటోషూట్ లు చేస్తూ అందాల వల ఎర వేస్త్తూ ఎవరూ దొరక్క పోతారా ? అన్నట్టు చూస్తోంది. నిజానికి కెరీర్ మొదట్లో కాస్త పద్ధతిగానే కనిపించిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం హాట్ హాట్ ఫొటోలతో వలపు వల వేస్తోంది.
హద్దులు చేరిపేసి అందాల గేట్లు తెంచేసి మరీ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.

మంచి మాటకారి
అన్నట్టు ఈ భామ మంచి మాటకారి కూడా, ఆ మధ్య ఒక సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఫ్లాప్ అయితే మూవీస్ రావు అంటారు. గ్లామర్‌గా లేకుంటే మూవీస్ రావు అంటారు. ఏడు ఎనిమిది సినిమాలు చేశాను. నందిత సినిమా చేయలేదు అని ఎవరూ అనరుని ఇప్పటికీ అవకాశాలు బాగానే వస్తుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. ప్రతి సినిమా కష్టపడే చేస్తుంటాం, అది హిట్ అవుద్దా ఫట్ అవుద్దా అనేది నా చేతిలో లేదని చెప్పుకొచ్చింది.

బ్రేక్ కోసం వెయిట్ చేస్తూ
తెలుగులో దాదాపు ఏడెనిమిది సినిమాల్లో నందిత నటించింది. కానీ ఆమెకు పేరు తెచ్చిన సినిమాలు అంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కదా చిత్రం అనే చెప్పాలి. ఆమెకు ఈ ఏడాది కాస్త స్పెషల్. ఎందుకంటే ఒకే నెలలో ఆమెవి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సుమంత్ హీరోగా వచ్చిన కపటధారి కాగా మరొకటి ఆమె లీడ్ రోల్ లో వచ్చిన అక్షర అనే సినిమా. అయితే రెండు సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.

ఈ మధ్యనే హ్యాకర్స్ షాక్
ఇక ఇదిలా వుంటే నందితా శ్వేతకి ఈ మధ్యనే హ్యాకర్స్ షాకిచ్చారట. ఈ విషయాన్ని నందితా శ్వేత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్‌కు గురైందని సరిగ్గా రెండు నెలల క్రితం ప్రకటించిన ఆమె దాని నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా వుండాలని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇక సినిమాల్లో అవకాశాల కోసం నందితా శ్వేత ఇన్ స్టా వేదికగా తన ఫొటో షూట్‌కి సంబంధించిన ఫోటోలని అభిమమానులతో పంచుకుంటోంది.


Click it and Unblock the Notifications











