మిమ్మల్ని చూడగానే నాకు లోపల ఏదో అయింది పూజ గారు.. నాని!
నేచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్, కొన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్ ని భిన్నంగా ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో తన సరసన నటిస్తున్న ఆకాంక్ష సింగ్ పాత్రని నాగార్జున ట్విట్టర్ లో పరిచయం చేశారు.
అదే విధంగా డాక్టర్ దాసు అంటే నాని సరసన రష్మిక నటిస్తోంది. రష్మికని నాని పూజగా పరిచయం చేశాడు. ఈ సందర్భంగా నాని చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ టైం మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే లోపల ఏదో రింగ్ అయింది పూజగారు అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.

రష్మిక కూడా తన ట్విట్టర్ లో స్పందించింది. 27 న నాకు డాక్టర్ దాస్ అపాయింట్ మెంట్ కావాలి. కొన్ని విషయాలలో క్లారిటీ చేసుకోవాలి అంటూ రష్మిక ట్వీట్ చేసింది. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. సెప్టెంబర్ 27 న దేవదాస్ చిత్రం భారీ విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











