KGF బ్యూటీతో నాని రొమాన్స్.. కన్నడ భామపై టాలీవుడ్ హీరోల మోజు!

ప్రెజెంట్ తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ కన్సిస్టెంట్ హీరో అలాగే నిర్మాతలకి మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పెద్ద హీరోలు అయినా చిన్న హీరోలు అయినా చూసుకుంటే అది నాచురల్ స్టార్ నాని అనే చెప్పి తీరాలి. కాగా ఇపుడు టైర్ 2 హీరోస్ లో నాని అందరికంటే ముందు పొజిషన్ లో కొనసాగుతుండగా నెక్స్ట్ కూడా పలు క్రేజీ సినిమాల లైనప్ ని తాను సెట్ చేసుకున్నాడు.

కాగా రీసెంట్ గానే నాని వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాదిలోనే మాస్ చిత్రం "దసరా" అలాగే క్లాస్ చిత్రం "హాయ్ నాన్న" లతో నాని అలరించి మంచి లాభాలు అందించాడు. ఇక ఈ సినిమాలు తర్వాత ఈ ఏడాదిలో పక్కా మాస్ చిత్రం "సరిపోదా శనివారం" తో వచ్చి కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు.

nani to romance with kgf beauty srinidhi shetty for this crime thriller

ఇలా టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా మారిపోయిన నాని ఇపుడు పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ చిత్రం KGF సినిమా బ్యూటీ శ్రీనిధి శెట్టితో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. కాగా నాని ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తాను ఇండస్ట్రీకి పరిచయం చేసిన యువ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలనుతో క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో సాలిడ్ క్రైమ్ థ్రిలర్స్ ని అందించిన శైలేష్ తన సినిమా యూనివర్స్ నుంచి "హిట్ 3" అనే సినిమాని నానితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ లోనే నాని శ్రీనిధి శెట్టితో రొమాన్స్ చేయనున్నాడట. కాగా ఈమె పేరు ఈ చిత్రానికి దాదాపు ఖరారు చేసేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇది నిజం అయితే తెలుగులో కేజీఎఫ్ బ్యూటీకి సాలిడ్ ఎంట్రీ లాక్ అయ్యినట్టే అని చెప్పాలి.

మరి ఈ చిత్రాన్ని శైలేష్ కొలను HIT (హిట్ ది ఫస్ట్ కేస్) అనే ఫ్రాంచైజ్ ని ఒక సినిమాటిక్ యూనివర్స్ లా క్రియేట్ చేసి ఆల్రెడీ రెండు సినిమాలు విశ్వక్ సేన్, అడివి శేష్ లతో తీసాడు. కాగా ఇప్పుడు మూడో సినిమాగా నానితో ఒక మాస్ పోలీస్ డ్రామాగా దీనిని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న అయి చిత్రాన్ని వచ్చే ఏడాది మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

nani to romance with kgf beauty srinidhi shetty for this crime thriller

ఇక శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో ఓకే అయితే తనకిది రెండో సినిమా అని చెప్పాలి. దీనికి ముందే ఈమెని టాలీవుడ్ స్టార్ బాయ్ టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ లాక్ చేసుకున్నాడు. తాను హీరోగా లేడీ డైరెక్టర్ నీరజ కోన తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది మరి మొత్తానికి అయితే తెలుగులో శ్రీనిధి శెట్టి ప్రస్తుతానికి మంచి ఆఫర్లునే అందుకుంటున్నట్టు అనిపిస్తుంది. మరి చూడాలి తెలుగులో ఈమెకి ఎలాంటి వెల్కమ్ దొరుకుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X