twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తికి మళ్లీ కష్టాలు.. బిగుస్తున్న ‘బెయిల్’ ఉచ్చు

    |

    బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని ఇప్పట్లో కష్టాలు వీడేటట్లు కనిపించడం లేదు. డ్రగ్స్ కేసులో రియా పొందిన బెయిల్ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సీరియస్‌గా వ్యవహరించబోతున్నది. రియాకు బెయిల్ ఇవ్వడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధం కావడం ఆమెను మరింత ఇబ్బందుల్లో పడేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఆ వివారాల్లోకి వెళితే...

    నెల రోజులు జైలులో రియా చక్రవర్తి

    నెల రోజులు జైలులో రియా చక్రవర్తి

    బాలీవుడ్‌కు డ్రగ్స్ మాఫియా సంబంధాలు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక డ్రగ్స్ మాఫియా హస్తం అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్సీబీ.. రియాచక్రవర్తిని అరెస్ట్ చేసింది. అయితే నెల రోజులపాటు రిమాండ్‌లో జైలు జీవితం గడిపిన రియా చక్రవర్తి బెయిల్‌పై బయటకు వచ్చింది.

    అర్ధనగ్నంగా జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఫోటోషూట్.. గ్లామర్‌తో దిమ్మతిరిగేలా

    ఎన్సీబీకి విచారించే హక్కు లేదంటూ

    ఎన్సీబీకి విచారించే హక్కు లేదంటూ

    అయితే రియా చక్రవర్తి కేసును విచారించడానికి ఎన్సీబీకి చట్టపరంగా హక్కులేదు. ఆగస్టు 19వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విచారించడానికి వారికి జురీస్‌డక్షన్ పరంగా హక్కు లేదు అని రియా తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు. ఈ కేసులో లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్‌పై రియా విడుదలైంది.

    ఎన్సీబీ వద్ద రియా పాస్‌పోర్టు

    ఎన్సీబీ వద్ద రియా పాస్‌పోర్టు

    షరతులతో కూడిన బెయిల్‌లో భాగంగా రియా చక్రవర్తి పాస్‌పోర్టును ఎన్సీబీ ఆధీనంలో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 రోజులకోసారి స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే అనుమతి లేకుండా ముంబైని వదిలి వెళ్లకూడదనే ఆంక్షలతో బెయిల్ ఇచ్చారు.

    రియా బెయిల్‌పై 18న విచారణ

    రియా బెయిల్‌పై 18న విచారణ


    చట్టానికి సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా రియా చక్రవర్తికి బెయిల్ ఇచ్చారంటూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్సీబీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఏస్ఏ బోబ్డేతో కూడిన ఏఎస్ బొప్పన్న, వీ రామాసుబ్రమణ్యం ధర్మాసనం విచారణ జరుపనున్నది. మార్చి 18 తేదీన పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు.

    English summary
    Narcotics Control Bureau moved Supreme Court over granting bail to Rhea Chakraborty. A bench headed by Chief Justice S.A. Bobde and comprising Justices A.S. Bopanna and V. Ramasubramanian is likely to hear the matter on March 18.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X