హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ, ప్రియుడితో బ్రేకప్ తర్వాత.. అసలు నిజం ఇదే!

మోడల్, నటి అయిన నర్గీస్ ఫక్రి గురించి సంచలన ఉహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి. రాక్ స్టార్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నర్గీస్ ఫక్రి తన అందంతో ఒక ఊపు ఊపింది. అందాలు ఆరబోసే ఫోటో షూట్స్, ఐటెం సాంగ్స్ తో నర్గీస్ ఫక్రి బాలీవుడ్ లో గ్లామర్ గర్ల్ గా మారిపోయింది. నర్గీస్ ఫక్రీ డేటింగ్, లవ్ ఎఫైర్స్ తో కూడా తరచుగా వార్తల్లో నిలిచేది. ఆ తరహాలోనే తాజాగా నర్గీస్ ఫక్రి గురించి ఓ ప్రచారం మొదలైంది. ఆమె ప్రెగ్నెన్సీతో ఉందనేది రూమర్ వైరల్ అవుతుండడంతో నర్గీస్ ఘాటుగా రియాక్ట్ అయింది.

ప్రియుడితో విడిపోయాక

ప్రియుడితో విడిపోయాక

ఓ బాలీవుడ్ మీడియా సంస్థ నర్గిస్ ఫక్రి గురించి సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం సారాంశం ప్రకారం నర్గీస్ ఫక్రీ ప్రస్తుతం గర్భంతో ఉందట. ఇటీవల నర్గీస్ ఫక్రీ వదులుగా ఉండే దుస్తులు ధరిస్తోంది. గర్భం కనిపించకుండా ఉండేందుకే ఇలాంటి వదులైన దుస్తులు ధరిస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. మరొక అంశం ఏంటంటే నర్గీస్ ఫక్రీ గర్భానికి కారణమైన తన ప్రియుడు మాథ్ ఆలోంజో నుంచి ఆమె విడిపోయిందట.

 వ్యాధితో బాధపడుతున్నా

వ్యాధితో బాధపడుతున్నా

తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్స్ తన ఫేమ్ కు డ్యామేజ్ చేసే విధంగా ఉండడంతో నర్గీస్ ఫక్రీ.. సదరు బాలీవుడ్ మీడియా సంస్థపై ఘాటుగా రియాక్ట్ అయింది. వెంటనే మీ ప్రచురణని తొలగించండి. మీరు అసత్యాలు ప్రచురిస్తున్నారు. కేవలం ఇది అసత్యం మాత్రమే కాదు.. ఒక మహిళ శరీరాన్ని కించపరిచినట్లుగా భావించాల్సి ఉంటుంది. వాస్తవాలు తెలుసుకొండి. నేను శరీరానికి సంబంధించిన వ్యాధితో భాదపడుతున్నా. అందుకే వదులుగా ఉండే దుస్తులు ధరిస్తున్నానాని నర్గీస్ పుకార్లకు చెక్ పెట్టింది.

ఏడాది నుంచి

ఏడాది నుంచి

ఏడాది కాలంగా నర్గీస్ ఫక్రీ, మాథ్ రిలేషన్ షిప్ లో ఉన్న మాట వాస్తవమే. పలు సందర్భాల్లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. ఇటీవల విభేదాలు కారణంగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ నర్గీస్ ఫక్రీ తన సోషల్ మీడియా నుంచి మాథ్ ఫోటోలని తొలగించింది. ప్రియుడితో బ్రేకప్ తర్వాత ప్రెగ్నెన్సీ రూమర్స్ రావడంతో ఆంతా షాక్ కి గురయ్యారు.

అప్పుడు తినడం వల్లే

అప్పుడు తినడం వల్లే

నర్గీస్ ఫక్రీ ఇలాంటి పుకార్లకు బలికావడం ఇదేమి తొలిసారి కాదు. 2017లో కూడా నర్గీస్ గురించి ఇలాంటి వార్తలే వచ్చాయి. ఆ సమయంలో కూడా నర్గీస్ ఫక్రీ సోషల్ మీడియాలో స్పందించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నేను బాగా తినడం వల్లనే కాస్త బొద్దుగా మారా. ఆ మాత్రం దానికే ప్రెగ్నెసీ అంటూ వార్తలు రాస్తారా అని నర్గీస్ అప్పట్లో మండిపడింది. సాగసం, సల్మాన్ ఖాన్ కిక్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టింది. హౌస్ ఫుల్ 3 లో హీరోయిన్ గా పుల్ లెన్త్ రోల్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కొన్ని చిత్రాలతో నర్గీస్ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X