అవి లేకుండా ఉండలేనంటున్న రష్మిక మందన్న.. ఫోటోలు షేర్ చేసి కోరికల చిట్టా!
కిరాక్ పార్టీతో చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. చిన్నదైనా, పెద్దదైనా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారారు రష్మిక. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్, పుష్ప సినిమాలు రష్మికకు తెలుగునాట స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి. టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్‌లోనూ చాన్సులు దక్కించుకుని హిట్ చిత్రాల్లో నటించారు రష్మిక.
బాలీవుడ్‌లోనూ అవకాశాలు చేజిక్కించుకుని నేషనల్ క్రష్‌గా మారారు రష్మిక మందన్నా. గతేడాది సందీప్ రెడ్డి వంగా - రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'యానిమల్'లో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయే భర్తను అర్ధం చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కదిద్దే ఇల్లాలిగా ఆమె అద్భుతంగా నటించారు. ఈ మూవీలో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించినప్పటికీ .. నటిగానూ మంచి మార్కులు పొందారు. యానిమల్ ఘన విజయంతో బీటౌన్‌లో రష్మికు వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. అయితే ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ, మంచి క్యారెక్టర్లకు ఓకే చెబుతున్నారు శ్రీవల్లి.

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ - తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సికందర్'లో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఏకంగా కండలవీరుడితో రొమాన్స్ చేసే అవకాశం రావడంతో ఆమె గాల్లో తేలుతున్నారు. దీనితో పాటు రైన్ బో, గర్ల్‌ఫ్రెండ్ అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ రష్మిక నటించనున్నారు. ఇటీవల కన్నడ హీరోయిన్స్‌లో పాపులర్ ఎవరంటూ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారు.
శ్రీలీల, అషిక రంగనాథ్, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త భామలు ఎంట్రీ ఇస్తున్నా రష్మిక దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో ఎలాంటి ఢోకా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సుకుమార్ - అల్లు అర్జున్ ల పుష్ప-2 ద్వారా ఆమె మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయమంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మిక తన వ్యక్తిగత విషయాలతో పాటు తన కొత్త సినిమా సంగతులను పంచుకుంటూ ఉంటారు. అలాగే సోషల్ ఇష్యూస్ పైనా రష్మిక స్పందిస్తారు.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మనిషి జీవితానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటో తన క్యూట్ ఫోటోల ద్వారా నేషనల్ క్రష్ తెలియజేశారు. అలాగే డైరీలో రాసుకున్న కొన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. మంచి భోజనం తీసుకోవడం, నవ్వుతూ నవ్విస్తూ ఉండటం, మంచి నిద్ర, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్, తన పెట్ డాగ్‌తో ఆడుకోవడం , సీట్లు తినడం, కాఫీ తాగడం, కష్టపడి పనిచేయడం వంటివి చేస్తానని రష్మిక చెప్పింది. ఇవి లేకుండా తన జీవితం ఊహించుకోలేనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న పోస్ట్ చాలా మందిని ఆలోచింపజేస్తోంది.


Click it and Unblock the Notifications











