Rashmika Mandanna రష్మిక మందన్న ఎవరికి గర్ల్‌ఫ్రెండ్?.. లవర్ పేరు చెప్పకుండా సీక్రెట్‌గా!

పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన రష్మిక మందన్న ఇండియన్ సినిమా రంగంలో తన జోరు కొనసాగిస్తున్నది. నేషనల్ క్రష్‌గా మారి గ్లామర్ పాత్రలను పండిస్తూ..మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో ఆకట్టుకొంటున్నది. తాజాగా మరోసారి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించేందుకు సిద్దమైంది. రష్మిక తాజా ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, బేబీ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఈ సినిమాకు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

National Crush Rashmika Mandanna to play Girlfriend for Rahul Ravindran

పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్‌లో తన అద‌ృష్టాన్ని పరీక్షించుకొంటున్న రష్మిక మందన్న ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఉమెన్ సెంట్రిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భావోద్వేగాలతో సాగే సినిమాలో టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. ఈ సినిమాకు గర్ల్‌ఫ్రెండ్‌ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు కృష్ణ వసంత్ కెమెరా వర్క్ అందిస్తుండగా, టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ హేషమ్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకు విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

National Crush Rashmika Mandanna to play Girlfriend for Rahul Ravindran

నటీనటులు: రష్మీక మందన్న తదితరులు

రచన, డైరెక్టర్: రాహుల్ రవీంద్రన్
సమర్పణ: అల్లు అరవింద్
మ్యూజిక్: హేషమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫి: కృష్ణ వసంత్
ప్రొడక్షన్ డిజైనర్: ఎస్ రామకృష్ణ, మోనికా నిగోత్రే
క్యాస్టూమ్: శ్రావ్య శర్మ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X