పడకగదిలో కోరిక తీర్చుతావా? ఆఫర్ ఇస్తా.. ఆ స్టార్ నిర్మాత బండారం బయటపెట్టిన నయనతార
సినిమా ఇండస్ట్రీలో శారీరక కోరికలు తీర్చితే గానీ వేషాలు ఇవ్వమని నీచ సంస్కృతి (క్యాస్టింగ్ కౌచ్)పై చర్చనీయాంశమవ్వడం కనిపిస్తూనే ఉంటారు. అగ్రతారలకు కూడా తమ కెరీర్ ఆరంభంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వడం మామూలే. ఇలాంటి సంఘటనలు పలువురు సినీ తారలు మీడియా ముందుకు వచ్చి సంచలనం రేపితే.. మరికొందరు పరువు కోసం మనసులోనే దాచుకొని మదనపడిన విషయాలు చాలానే ఉంటాయి. అయితే తాజాగా ఓ నిర్మాత తన కోరిక తీర్చితే ఆఫర్ ఇస్తానని చెప్పిన విషయాన్ని, చేదు అనుభవాన్ని నయనతార ఇటీవల మీడియాలో బయటపెట్టారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి నయనతార చెప్పిన విషయాలు ఏమిటంటే?

2003లో సినీ రంగ ప్రవేశం
మోడల్‌గా రాణిస్తున్న నయనతార 2003లో మనస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. అయితే రజనీకాంత్ చంద్రముఖి తర్వాతే నయనతార కెరీర్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. ఆ తర్వాత గజనీలో ఐటెమ్ సాంగ్‌తో మరింత పాపులారిటీ సాధించింది. తెలుగు, తమిళంలో భిల్లా చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ప్రభుదేవాతో అఫైర్, పెళ్లి
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకొన్నది. కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాతో అఫైర్ పీకల్లోతు ఉండగా.. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఆ సమయంలో శ్రీ రామరాజ్యం చిత్రం తనకు చివరి చిత్రమని ప్రకటించింది. ఆ సినిమా షూటింగ్ చివరి రోజున ఆమెకు బాపుతో సహా చిత్ర యూనిట్ ఘనంగా వీడ్కోలు తెలిపారు. అయితే ఆ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు రాకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చింది.

ఆ నిర్మాత కోరికకు లొంగకుండా
నయనతార తన సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో విజయాలను అందుకొన్నది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్ ఆరంభంలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి. కానీ అలాంటి వాటికి లొంగకుండా ధైర్యంగా నిర్మాతల ప్రపోజల్స్ రిజెక్ట్ చేశాను అని నయనతార చెప్పింది.

ధైర్యంగా నిర్మాతను ఎదురించా
దక్షిణాదిలో ఓ ప్రముఖ నిర్మాత నాకు భారీ ప్రాజెక్టులో ఆఫర్ ఇస్తానని వచ్చారు. కానీ ఆఫర్ ఇవ్వాలంటే తన కోరికలు తీర్చాలనే ప్రపోజల్ ముందు పెట్టాడు. దాంతో ఆయన కోరికను వినగానే మతిపోయింది. అయితే అలాంటి కోరికలను తీర్చడం నాతో కాదని నిర్ణయించుకొన్నాను. నిర్మాత ముఖం మీదే నేను ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను. అడ్డదారుల్లో కాకుండా నేను నా ప్రతిభ వల్లే ఎదగాలని అనుకొన్నాను. అందుకే ధైర్యంగా ఆ సినిమాను వదులుకొన్నాను అని నయనతార చెప్పింది.

క్యాస్టింగ్ కౌచ్ గురించి నయనతార
స్టార్ హీరోయిన్‌గా, లేడి సూపర్ స్టార్‌గా మారిన తర్వాత నయనతార ఇలాంటి విషయాలు వెల్లడించడం ప్రస్తుతం దక్షిణాది మీడియాలో సంచలనంగా మారింది. వినోద పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ తుట్టెను మరోసారి లేపిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నయనతార ఎందుకు ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ఆ నిర్మాత ఎవరు అనే విషయాన్ని గోప్యంగా ఉంచడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

షారుక్ ఖాన్‌తో నయనతార బాలీవుడ్ ఎంట్రీ
నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి గోల్డ్ అనే సినిమాలో, చిరంజీవితో గాడ్‌ఫాదర్, తమిళంలో కనెక్ట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో జవాన్‌లో నటిస్తూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. లేడీ సూపర్ స్టార్, ఎన్‌టీ 81 చిత్రాల్లో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











