Nayanatara Video Leak.. సముద్రం మధ్యలో శృంగారం.. ఆ సూపర్ స్టార్‌తో క్రేజీగా రొమాన్స్!

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌ ఇమేజ్ సొంతం చేసుకొన్న నయనతార ప్రస్తుతం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దక్షిణాదిలో సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ చిత్రం ద్వారా నయనతార హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు.

హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షారుక్, నయనతార రొమాంటిక్ సీన్ లీక్ అవ్వడం అభిమానుల్లో జోష్ పెంచింది. ఆ లీక్ వీడియో వివరాల్లోకి వెళితే..

Nayanatara romance with Shah Rukh Khans Jawan song Video leaked in Social media

నయనతారతోపాటు ఇంకా ఎవరంటే?: తమిళంలో సూపర్ స్టార్ విజయ్‌తో తేరి, మెర్సల్, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన అట్లీ ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతారతోపాటు సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, ప్రియమణి, విజయ్ సేతుపతి నటిసున్నారు. దీపిక పదుకోన్, దళపతి విజయ్, సంజయ్ దత్ తదితరులు అతిథి పాత్రలో కనిపిస్తారనే విషయం మీడియాలో వైరల్ అవుతున్నది.

బికినీలో నయనతార: అయితే నయనతార విషయానికి వస్తే.. జవాన్ చిత్రంలో షారుక్ ఖాన్‌తో రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత నయనతార బికినీలో కనిపించనున్నారు. భిల్లా సినిమా తర్వాత మళ్లీ జవాన్ సినిమా కోసం బికినీలో కనిపించనున్నారు. తొలుత బికినీ ధరించేందుకు నయనతార ఒప్పుకోలేదని, కానీ అట్లీ సన్నివేశాల ప్రాధాన్యత గురించి చెప్పడంతో ఒప్పుకొన్నట్టు సమాచారం.

Nayanatara romance with Shah Rukh Khans Jawan song Video leaked in Social media

సముద్రంలో నావపై సాంగ్: నయనతార, షారుక్ ఖాన్‌పై విదేశాల్లో రొమాంటిక్ సాంగ్‌ను దర్శకుడు అట్లీ చిత్రీకరిస్తున్నాడు. ఈ పాటలో షారుక్, నయనతార శృంగారపరమైన సన్నివేశాల్లో కనిపించనున్నారు. ఈ పాటను వెరైటీగా సముద్రంలో ఓ నావపై ఉన్న డెక్‌పై షూట్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ సాంగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

లీకైన పాట వీడియోలో: జవాన్ చిత్రంలోని లీకైన పాటలో షారుక్ ఖాన్, నయనతార చాలా అన్యోన్యంగా కనిపించనున్నారట. నావపైన ఉన్న డెక్‌పై ఇద్దరూ డ్యాన్స్ డైరెక్టర్ సూచన మేరకు స్టెప్పులేస్తూ కనిపించారు. ఓ అభిమాని లీక్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చాలా మంది షేర్ చేస్తూ ట్రెండింగ్‌గా మార్చారు.

Nayanatara romance with Shah Rukh Khans Jawan song Video leaked in Social media

జవాన్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?: షారుక్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల పఠాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొన్నారు. ఈ చిత్రం 1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం జవాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 2వ తేది, 2023న రిలీజ్ కానున్నది. ఈ సినిమా తర్వాత రాజు హిరాణీ చిత్రం దర్శకత్వంలో డంకీ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X