బాలీవుడ్ హీరో కోసం హద్దులు దాటేలా నయనతార బికినీ ట్రీట్.. అందుకేనా అంత రెమ్యునరేషన్!
పఠాన్ సినిమాతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఇక బాలీవుడ్ నుంచి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఇక బాలీవుడ్ లో హైయెస్ట్ షేర్ ని కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో నయనతార ఊహించని గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు టాక్ ఆ వివరాల్లోకి వెళితే..

యాక్షన్ మూవీగా..
హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గానే ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండగా నయనతార హీరోయిన్ గా చేస్తుంది. నయనతారకి ఇదే మొట్టమొదటి హిందీ మూవీ కావడం విశేషం. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నెగిటివ్ టాక్
అలాగే దీంతో మరోసారి వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ ని అందుకోవాలని షారుఖ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. పఠాన్ సినిమాతో షారుక్ ఖాన్ ఊహించని విధంగా వెయ్యి కోట్ల మార్కెట్ను అందుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఆ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా భారీ స్థాయిలో వసూళ్ళు రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో జవాన్ సినిమాపై కూడా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

గ్లామర్ షో
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. నయనతార గతంలో ఎప్పుడూ లేనివిధంగా జవాన్ సినిమాలు కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె గ్లామర్ షో కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుందట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే ఆమె స్టన్ అయ్యేలా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

షాకింగ్ రెమ్యునరేషన్
నయనతార జవాన్ సినిమా కోసం తన కెరీర్ మొత్తంలోనే అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా నాయనతార సౌత్ ఇండస్ట్రీలోని అందరికంటే ఎక్కువ స్థాయిలో 6 నుంచి 8 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ భామ జవాన్ సినిమా కోసం ఏకంగా 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్.

ఈసారి బికినీ
మూవీలో నయనతార బికినీ వేస్తుందనే మాట గట్టిగానే వినిపిస్తుంది. కెరియర్ ఆరంభంలో బిల్లా సినిమాలో ఈ బ్యూటీ లైట్ బికినీలో నటించింది. అలాగే శింబుతో ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా నటించింది. ఎక్కువగా కమర్షియల్ చిత్రాలతో గ్లామర్ హీరోయిన్ గా నయనతార తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంది. అయితే తరువాత ఫిమేల్ సెంట్రిక్ కథలతో లేడీ సూపర్ స్టార్ అనే బ్రాండ్ తెచ్చుకుంది. సోలోగానే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది.

జవాన్ కోసం ఇలా..
హీరోయిన్ గా నటిస్తూ ఉన్నా కూడా గ్లామర్ రోల్స్ కి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయితే జవాన్ మూవీ కోసం ఇప్పుడు బికినీ షూట్ లో కనిపించడానికి నయనతార రెడీ అవుతుంది అనే టాక్ వినిపిస్తుంది. షారుఖ్ ఖాన్ సినిమాలలో ఇంటిమేట్, బికినీ సన్నివేశాలకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఈ నేపధ్యంలోనే బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని మూవీలో బికినీ షూట్ లో కనిపించడానికి నయనతార ఒకే చెప్పిందని ప్రచారం వైరల్ అయ్యింది.


Click it and Unblock the Notifications











