Nayanathara Remuneration: నయనతారకు రికార్డు రెమ్యునరేషన్.. మన శంకర వరప్రసాద్ గారు మూవీకి పారితోషికం ఎంతంటే?

దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లలో ముందు వరుసలో ఉండే వారిలో నయనతార ఒకరు. టాప్ హీరోల సరసన నటించడమే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తన సత్తాను నిరూపించుకొని మార్కెట్‌ను సుస్థిరం చేసుకొన్నారు. అంతేకాకుండా నయనతార తనకంటూ ఇమేజ్‌ను సొంతం చేసుకొని టాప్ రెమ్యునరేషన్ అందుకొనే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఇలాంటి డిమాండ్ ఉన్న అందాల తార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankar Vara Prasad Garu) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించినందుకు ఆమెకు భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పారు. ఆమె పాత్ర విశేషాలు, అలాగే రెమ్యురేషన్ వివరాల్లోకి వెళితే..

అందం, అభినయంతో ఆకట్టుకొనే నయనతార తెలుగులో టాప్ హీరోలందరితో నటించారు. అయితే ఆమె సినిమాలో తన పాత్రను పూర్తి చేయడం వరకే సహకరిస్తారు. కానీ ప్రమోషన్స్‌లో పాల్గొనరు. నిర్మాతలకు సపోర్టివ్‌గా ఉండరు అనే అపవాదు అమెపై ఉంది. కానీ ఆమె అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మన శంకర్ వరప్రసాద్ సినిమాకు పలు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాకు, నిర్మాతకు అండగా నిలిచారు. ఈ విషయం సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది.

Nayanathara Remuneration

మన శంకర వరప్రసాద్ చిత్రంలో చిరంజీవి సరసన కీలక పాత్రలో నటించారు. శశిరేఖ అనే పాత్రలో శంకర వరప్రసాద్ క్యారెక్టర్‌కు భార్యగా నటిస్తున్నారనే విషయం ప్రమోషన్స్‌లో స్పష్టమైంది. చిరంజీవి సరసన నటించడం ఇది మూడోసారి. సైరా నర్సింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా మన శంకర వరప్రసాద్ చిత్రంలో ఆమెతో కలిసి నటించడం, వారి మధ్య కెమిస్ట్రీ భారీగా వర్కవుట్ అయిందనే ఫీలింగ్ కలిగింది.

ఈ చిత్రంలో నటించిన ఆమెకు నిర్మాతలు భారీగా పారితోషికాన్ని ముట్టచెప్పారు. ఆమె రెమ్యునరేషన్ సౌత్ ఇండియాలోనే టాప్ రేంజ్‌లో ఉంది. ఆమె స్థానానికి, డిమాండ్‌కు ఏ మాత్రం ఢోకాలేదు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే భారీ పారితోషికం అందుకొన్న ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో చిత్ర యూనిట్‌కు పాజిటివ్‌గా మారింది. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను ఆమెకు సుమారుగా 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకొన్నారు అనే ప్రచారం సినీ వర్గాలో జరుగుతున్నది.

నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో షారుక్ ఖాన్‌తో కలిసి జవాన్ చిత్రంలో నటించారు. అలాగే తమిళంలో ఇరైవన్, టెస్ట్ సినిమాల్లో నటించారు. అలాగే యష్‌తో కలిసి టాక్సిక్ అనే చిత్రంలోను, అలాగే ముక్తి అమ్మన్ 2 సినిమాలోను, మనగట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, పాట్రియాట్, హైన, రక్కయి, నందమూరి బాలకృష్టతో ఆయన నటించే 111 చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X