Nayanathara కవల పిల్లల్ని చూశారా? ఎంత ముద్దొస్తున్నారో.. తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసిన నయనతార

లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె సౌత్ హీరోయిన్లలో టాప్ హీరోయిన్ గా రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి... పెళ్లి చేసుకుంది. ఇక సరోగసి ద్వారా ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చారు ఈ జంట. అయితే నయన్ తనకంటూ ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్ లేదు. ఇప్పటి వరకు విగ్నేష్ శివన్ ఖాతా ద్వారానే పోస్టులు పెట్టే వారు. అలాంటిది నయన్ ఈరోజు.. ఇన్ స్టాగ్రామ్ అకౌంత్ ఖాతా తెరిచింది. అంతే కాదు.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....

హీరోకు మించిన క్రేజ్.. ఎవరికైనా ఉంది అంటే అది నయనతారకేనని చెప్పవచ్చు. ఇక ఈ చైన్నై భామ 2003లో గౌరీ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ్ లో అయ్య, చంద్రముఖి సినిమాలో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక చంద్ర ముఖి సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఈ భామ వెంటటేష్ సరసన లక్ష్మి అనే సినిమాలో నటించి.. మెప్పించింది. ఇక అక్కడి నుంచి తెలుగులోనూ ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.

NayanaThara Makes Instagram Entry and She Reveals Faces of Kids Uyir And Ulag in First Post

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. గత 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక శింబుతో, ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇక వారితో బ్రేకప్ తర్వాత.. స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. ఇక వీరు ఆ మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు.

NayanaThara Makes Instagram Entry and She Reveals Faces of Kids Uyir And Ulag in First Post

విగ్నేష్ శివన్, నయనతార వివాహం జరిగి మూడు నెలలు కాకముందే వీరు తల్లిదండ్రులు కావడం సంచలనం సృష్టించింది. దానికి కారణం వీరు సరోగసి ద్వారా పిల్లలను కన్నారు. ఇక కవల పిల్లలకు జన్మనిచ్చిన వీరు ఇప్పటి వరకు వీరి ఫేస్ ను రీవిల్ చేయలేదు. ఇక నయన తారకు ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఏమి లేవు. ఆమెకు సంబంధించిన అప్టేట్స్ అన్ని.. విగ్నేష్ శివన్ తన ఖాతా ద్వారానే అభిమానులకు చేరవేస్తాడు.

NayanaThara Makes Instagram Entry and She Reveals Faces of Kids Uyir And Ulag in First Post

అయితే ఈ భామ సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది. నయన్ ఇన్ స్టాగ్రామ్ లోకి నేడు ఎంట్రీ ఇచ్చింది. దీనితో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వెల్ కమ్ కన్మణి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నయనతార తన పిల్లలను ఇప్పటి వరకు రివీల్ చేయలేదు.. కానీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన పిల్లలతో కలిసి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎంట్రీ సీన్ కు జవాన్ సినిమాలోని ఓ సాంగ్ కూడా జత చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇక ఇన్ స్టాలో అడుగుపెట్టిన నయనతార ఐదుగురిని ఫాలో అవుతుంది. అందులో విగ్నేశ్ శివన్, షారుఖ్ ఖాన్, అనిరుధ్, మిచెల్ ఒబామా, రౌడి పిక్చర్స్ అకౌంట్స్ ఉన్నాయి. ఇక నయన్ ఓపెన్ చేసిన గంటకే 200కె ఫాలోవర్స్ వచ్చారు. మొత్తానికి లేడి సూపర్ స్టార్ ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి నయన తార జవాన్ సినిమా చేస్తోంది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ ఆకట్టుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X