twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాయ్ ఫ్రెండ్ కు వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార.. ప్రేమగా హగ్గులు ముద్దులతో..

    |

    సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నయనతార ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. రెండు సార్లు ప్రేమలో విఫలం అయినప్పటికీ కూడా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన జీవితాన్ని సరికొత్తగా స్టార్ట్ చేస్తోంది. విమర్శలు ఎన్ని వచ్చినా కూడా తనకు నచ్చినట్లుగా జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇక ప్రస్తుతం తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార డేటింగ్ చేస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. గత కొన్నేళ్ల నుంచి వీరి ప్రేమ ప్రయాణం చాలా హ్యాపీగా కొనసాగుతోంది. ఇక నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా నయనతార తన బాయ్ ఫ్రెండ్ కు ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చింది. వీరికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

     పోటీగా ఎంతమంది వచ్చినా..

    పోటీగా ఎంతమంది వచ్చినా..

    2003 నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న నయనతార మొదట మలయాళం సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మెల్లగా తెలుగు తమిళ సినిమాలలో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. సక్సెస్ ఫెయిల్యూర్ ఎన్ని వచ్చినా కూడా నయనతార కెరీర్ పై ఎప్పుడు కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. పోటీగా ఎంతమంది బ్యూటీలు వచ్చినా నయనతార తనదైన శైలిలో అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది.

    రెమ్యునరేషన్ విషయంలో

    రెమ్యునరేషన్ విషయంలో

    తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మొదట్లోనే స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కింది. గజిని, శివకాశి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ దక్కడంతో ఈ బ్యూటీకి పారితోషికం కూడా ఎక్కువగానే దక్కేది. ఇప్పటివరకు నయనతార అపజయాల కారణంగా ఏనాడు తన పారితోషికాన్ని తగ్గించింది లేదు. ఒకవేళ ఆమెకు చిన్న బడ్జెట్ లో నటించే ఛాన్స్ లు వస్తే మాత్రం వాటి కోసం ప్రత్యేకంగా పారితోషికాన్ని తగ్గించేది.

    ప్రేమలో.. చేదు అనుభవాలు

    ప్రేమలో.. చేదు అనుభవాలు

    తెలుగు తమిళ్ అని తేడా లేకుండా దాదాపు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని చేదు అనుభవాలను కూడా ఎదుర్కొంది. మొదట ఆమె శింబుతో కొన్నేళ్లపాటు ప్రేమను కొనసాగించింది. ఇక అనంతరం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా తో కూడా కొన్నాళ్ల పాటు ప్రేమ లో కొనసాగింది. దాదాపు వీరి ప్రేమ వివాహం ఖాయమయిందని అనుకున్న సమయంలో మరొక గొడవతో అది కూడా బ్రేకప్ గా మారిపోయింది.

     దర్త్శకుడితో ప్రేమాయణం

    దర్త్శకుడితో ప్రేమాయణం

    అయితే గత కొంత కాలంగా నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అతను అర్థం చేసుకోవడంలో కూడా బాగా నచ్చడంతో నయనతార పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. చాలాసార్లు వీరు పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు అని తమిళ చిత్ర పరిశ్రమలో చాలా కథనాలు వెలువడ్డాయి. అయితే ఎన్ని కథనాలు వెలువడిన కూడా నయన్ వాటిని పట్టించుకోలేదు. ఒక మంచి నటిగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది.

    సర్‌ప్రైజ్‌

    సర్‌ప్రైజ్‌

    ఇక రీసెంట్ గా నయనతార తన బాయ్ ఫ్రెండ్ ను మరోసారి సర్‌ప్రైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమికుల రోజు సందర్భంగా నయనతార తన బాయ్ ఫ్రెండ్ తో సమయాన్ని గడిపింది.

    హగ్గులు ముద్దులు..

    విగ్నేష్ కోసం ప్రత్యేకంగా ఒక బొకే తీసుకువచ్చి స్వీట్ గా హాగ్ ఇచ్చేసింది. ఇక విగ్నేష్ కూడా నయనతారకు రొమాంటిక్ గా ముద్దు పెట్టిన విధానం వీడియో లో హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ వీడియో అన్ని రకాల సోషల్ మీడియాలో ప్లాట్ ఫాంలలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోతుంది. ఇక ఇదే ఏడాది వీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తమిళ మీడియాలో అయితే చాలా రకాల కథనాలు వెలువడుతున్నాయి.

    English summary
    Nayanathara valentines day surprise to her boyfriend special video viral,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X