వరుసగా మూడు ప్లాపులు, హాట్ లేడీకి ఊహించని షాక్!
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఏ హీరోయిన్ అయినా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. యువ హీరోయిన్లతో పోటీ పడుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే నయనతారకు ఇవేమీ పెద్ద కష్టం కాలేదు. తన అందం, టాలెంటుతో అందరినీ వెనక్కినెట్టి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత కూడా టాప్ పొజిషన్ దక్కించుకుంది. సౌతిండియాలో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతోంది. ఆమె నటించిన చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంతో ఇండస్ట్రీలో నయనతారకు తిరుగులేకుండా పయింది.
2018లో నయనతార నటించిన 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. 2019 సంవత్సరం 'విశ్వాసం' లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో మొదలు పెట్టింది. ఈ ఏడాది కూడా నయన్‌కు శుభారంభం ఇచ్చింది అనుకునే సమయంలో ఊహించని షాక్ తగిలింది. వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

నయనతార నటించిన హారర్ మూవీ 'ఐరా' మార్చిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన మరో చిత్రం మిస్టర్ లోకల్ మే నెలలో సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. నయన్ లేటెస్ట్ మూవీ కలైథుర్ కాలం గతవారం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం నయనతార వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' చిత్రంతో పాటు తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న 'బిగిల్', సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'దర్బార్' చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











