నేను చేసిన అత్యంత చెత్త క్యారెక్టర్ అదే.. సెన్సేషనల్ కామెంట్ చేసిన నయనతార
నయన తార ప్రస్తుతం సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అయితే ఇంతటి స్థాయిని చేరుకోవడానికి నయన్ పడిన కష్టం ఎంతో ఉంది. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతీ పాత్ర చేసుకుంటూ తనను తాను నిరూపించుకుంటూ వచ్చింది. గ్లామర్ షో చేస్తూ.. సైడ్ హీరోయిన్‌గా చేస్తూ.. సూపర్ స్టార్ రేంజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్.. ఓ నిజాన్ని బయట పెట్టింది.
తన ఇన్నేళ్ల కెరీర్‌లో పోషించిన అత్యంత దరిద్రమైన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. గజిని చిత్రంలో తాను వేసిన చిత్ర క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. మొదట కథ చెప్పినప్పుడు తన పాత్ర బాగానే అనిపించిందని, కానీ తీరా సినిమా చూస్తే ఇంకోలా కనిపించిందని కామెంట్ చేసింది. అదే తన కెరీర్ మొత్తంలో చెత్త పాత్ర అని గతాన్ని గుర్తు చేసుకుంది.

అయితే గజిని చిత్రాన్ని తెరకెక్కించిన ఏఆర్ మురుగదాస్‌తో ఇన్నేళ్లకు దర్భార్ చిత్రంలో మళ్లీ కలిసి పనిచేస్తోంది. మరి ఈసారైనా ముఖ్యపాత్రను ఆఫర్ చేశాడా? లేదా.. తీరా చూశాక నయన్‌కు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో చూడాలి. ఈ చిత్రంలో రజినీ కూతురుగా నివేధా థామస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీకైన పోస్టర్స్‌తో అంచనాలు పెరగ్గా.. సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దమైంది.


Click it and Unblock the Notifications











