నయనతార గురించి సెన్సేషనల్ న్యూస్ లీక్: ప్రియుడు బలవంతం చేయడంతో.!

By Manoj

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషలన్నింటిలోనూ నటిస్తూ చాలా కాలంగా తన హవాను చూపిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే అందుకుంటోంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. కొన్నేళ్లుగా తన ప్రాధాన్యాన్ని బట్టే సినిమాలు ఓకే చేస్తోంది. ఇక, వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఆమె హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఓ సంచలన నిర్ణయం తీసుకుని తాజాగా నయనతార మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ సంగతులు మీకోసం.!

ఇంటికి వచ్చిన వాళ్లకు షాకిస్తోన్న నయన్

ఇంటికి వచ్చిన వాళ్లకు షాకిస్తోన్న నయన్

వరుస విజయాలతో దూసుకుపోతోంది నయనతార. అన్ని భాషల్లోనూ లక్కీ ఛార్మ్‌గా పేరు తెచ్చుకోవడంతో చాలా మంది ఫిల్మ్ మేకర్లు ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న చందంగా.. తన వద్దకు వచ్చిన నిర్మాతల ముందు భారీ డిమాండ్లు ఉండి షాకిస్తోందట ఈ లేడీ సూపర్ స్టార్. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

ఫిల్మ్ కెరీర్ సక్సెస్.. పర్సనల్ కెరీర్ ఫెయిల్

ఫిల్మ్ కెరీర్ సక్సెస్.. పర్సనల్ కెరీర్ ఫెయిల్

సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్నప్పటికీ... పర్సనల్ లైఫ్‌లో మాత్రం నయనతార విఫలం అవుతోంది. దీనికి కారణం ఇప్పటికే ఆమె ఇద్దరు బాయ్‌ఫ్రెండ్‌లకు బ్రేకప్ చెప్పడమే. వారిలో ఒకరు ప్రముఖ హీరో శింబు కాగా, మరొకరు డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా. మొదటి లవర్‌తో మధ్యలోనే విడిపోగా.. రెండో ప్రియుడిని మాత్రం పెళ్లి పీటలెక్కే ముందు వదిలేసింది.

నయన్ జీవితంలోకి మరో సినీ ప్రముఖుడు

నయన్ జీవితంలోకి మరో సినీ ప్రముఖుడు

ఇద్దరు ప్రియులతో విడిపోయి, సినిమాలపై దృష్టి సారిస్తున్న తరుణంలో నయనతార జీవితంలోకి యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ ఎంటర్ అయ్యాడు. ‘నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల క్రితం ఈ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఈ జంట గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.

తెలిసిన తర్వాత ఇద్దరూ అస్సలు తగ్గడం లేదు

తెలిసిన తర్వాత ఇద్దరూ అస్సలు తగ్గడం లేదు

నయనతార - విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరూ బహిరంగంగానే ఒప్పుకున్నారు. అప్పటి నుంచి హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ తరచూ కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు. దీంతో ఈ జంటపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విఘ్నేష్‌తో నయన్ పెళ్లి గురించి కూడా జోరుగా ప్రచారం జరిగింది.

నయనతార గురించి సెన్సేషనల్ న్యూస్ లీక్

నయనతార గురించి సెన్సేషనల్ న్యూస్ లీక్

కొన్నేళ్లుగా నయనతార తన ప్రియుడితో కలిసి దేవాలయాలను సందర్శిస్తోంది. తమ బంధం బలంగా ఉండాలన్న కోరికతోనే వాళ్లిద్దరూ తరచూ ఆలయాలకు వెళ్తున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నయనతార సంచలన నిర్ణయం తీసుకుందని ఓ న్యూస్ లీక్ అయింది.

Recommended Video

#Darbar : Rajinikanth's Darbar Box Office Collections Day 1
ప్రియుడు బలవంతం చేయడంతో ఒప్పుకుంది

ప్రియుడు బలవంతం చేయడంతో ఒప్పుకుంది

చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట పెళ్లికి సిద్దమైందనేదే ఆ న్యూస్ సారాంశం. విఘ్నేష్ కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా పెళ్లి గురించి అతడిపై ఒత్తిడి తెస్తున్నారట. ఈ విషయాన్ని నయన్‌కు చెప్పడంతో ఆమె బలవంతంగా ఒప్పుకుందని తమిళ ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో నయన్ పెళ్లి కూతురు కాబోతుందని ప్రచారం మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X