అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు.. విడిపోకుండా ఉండేందుకే ఇలా చేస్తోందా.!

By Manoj

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. వరుసగా సినిమాలు చేసుకుంటూ అన్ని ఇండస్ట్రీల్లో తన హవాను కొనసాగిస్తోంది గ్లామరస్ హీరోయిన్. భాషతో సంబంధం లేకుండా ఆమె వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి నటిస్తూ తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకుంటోంది. కెరీర్ విజయవంతం అయినప్పటికీ.. ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. ఈ నేపథ్యంలో నయనతార వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేసింది..? పూర్తి వివరాల్లోకి వెళితే..

 అందరికీ నయనతారే కావాలి.. క్యూ కడుతున్నారు

అందరికీ నయనతారే కావాలి.. క్యూ కడుతున్నారు

ప్రస్తుతం సౌతిండియాలోని హీరోయిన్లలో నయనతారకు ఉన్న క్రేజ్ మరెవరికీ లేదు. అందుకే డేట్స్ కోసం అన్ని పరిశ్రమలకు చెందిన ఫిల్మ్ మేకర్లు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. దీంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచేస్తోంది. ఇప్పటికే బడా సినిమాల్లో నటించిన నయన్.. రాబోయే రోజుల్లోనూ బిజీ బిజీగా గడిపేందుకు ప్లాన్ చేస్తోంది.

 రెండు భారీ సినిమాలు పేరు తెచ్చాయి

రెండు భారీ సినిమాలు పేరు తెచ్చాయి

నయనతార.. స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి మెప్పించింది. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' కాగా, మరొకటి ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్'. ఈ రెండింటిలోనూ ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలు మాత్రమే కాదు.. ఇతర భాషల్లోనూ ఆమె మంచి మంచి సినిమాలు చేసింది.

సినిమాలు సక్సెస్.. కానీ, ప్రేమే విఫలం

సినిమాలు సక్సెస్.. కానీ, ప్రేమే విఫలం

లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల పరంగా ఎంతో విజయవంతం అయింది. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లను ఎదుర్కొంది. కెరీర్ ఆరంభంలో ఓ ప్రముఖ హీరోతో ప్రేమాయణం సాగించిన నయన్.. ఆ తర్వాత ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ రెండు బంధాలు పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే ఆగిపోయిన విషయం తెలిసిందే.

నయన్ జీవితంలోకి విఘ్నేష్

నయన్ జీవితంలోకి విఘ్నేష్

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార దాదాపు ఐదేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. అంతేకాదు, వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్తుందని ఆమె గతంలోనే ప్రకటించింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ విహారయాత్రలకు వెళుతున్నారు. అక్కడి ఫొటోలను విఘ్నేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో హాట్ టాపిక్ అవుతున్నారు.

మరోసారి ఆ ప్రదేశాలకు వెళ్లిన జంట

మరోసారి ఆ ప్రదేశాలకు వెళ్లిన జంట


కొద్ది రోజుల క్రితం నయనతార - విఘ్నేష్ దేవాలయాల సందర్శనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట తిరుమలలో కూడా పర్యటించారు. ఇక, తాజాగా వీళ్లిద్దరూ కలిసి కన్యాకుమారిలోని భాగవతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత తిరుచెందూర్ మురుగన్ దేవాలయానికి వెళ్లారు. దీంతో సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
అనుమానాలు మొదలయ్యాయి

అనుమానాలు మొదలయ్యాయి

నయనతార.. తన ప్రియుడితో కలిసి తరచూ ఏదో ఒక ఆలయానికి వెళ్తోన్న నేపథ్యంలో ఆమె గురించి ఓ ఆసక్తికరమైన ప్రచారం చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఇద్దరు ప్రియులతో విడిపోయిన నయన్.. ఈ సారి ఎలాగైనా పెళ్లి వరకు వెళ్లాలని భావిస్తుందని, అందుకే తరచూ విఘ్నేష్‌తో కలిసి శాంతి పూజలు నిర్వహిస్తుందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X