శంకర వరప్రసాద్ సక్సెస్ జోష్‌లో నయనతార.. వివాదాలకు చెక్ పెట్టి త్రిషతో బోట్ షికారు!
Nayanthara - Trisha: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నేళ్లుగా చర్చనీయంగా ఉన్న ఓ బంధంపై క్లారిటీ వచ్చింది. ఇద్దరూ అగ్ర హీరోయిన్ల మధ్య ఒకప్పుడు విభేదాలు, ఇద్దరూ మధ్య పోటీ అంటూ వచ్చిన వార్తలకు తెరపడినట్టు అయింది. ఇప్పుడూ ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా వారి హ్యాపీ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ అనూహ్య రీయూనియన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. సౌత్ ఇండియన్ లేడి సూపర్ స్టార్ నయనతార, స్టార్ హీరోయిన్ త్రిష. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక జాయింట్ గా చేసిన ఓ పోస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందులో సముద్ర తీరంలో యాచ్‌పై సేద తీరుతున్న హ్యాపిగా గడుపుతున్నారు. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, హార్ట్ ఎమోజీలతో పోస్ట్ చేశారు. ఇందులో నయనతార బ్లాక్ వి-నెక్ టాప్, జీన్స్‌లో స్టైలిష్‌గా కనిపించగా, త్రిష బ్లాక్ టీషర్ట్, జాకెట్‌తో కూల్ లుక్‌లో మెరిశారు. ఈ ఫోటోలు చూసిన చాలామంది 'ఇది నిజమేనా?', 'ఏఐ ఫోటోలేమో అనుకున్నాం'అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.

ఎందుకు నమ్మలేకపోయారంటే? 2008 -10 ప్రాంతం నయనతార - త్రిష మధ్య విభేదాలున్నాయనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా తమిళ సినిమా కురివి (Kuruvi) విషయంలో ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ క్లాష్ జరిగిందని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే ఆ సమయంలోనే త్రిష ఈ రూమర్లను ఖండిస్తూ.. 'మీడియా ఊహాగానాలే తప్ప మా మధ్య పెద్ద గొడవలు ఏమీ లేవు' అని స్పష్టం చేసింది. చిన్నపాటి వ్యక్తిగత అపార్థాలు తప్ప ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలాంటి సమస్యలు లేవని ఆమె అప్పుడే చెప్పింది.
ఇక నయనతార కూడా తర్వాతి రోజుల్లో స్పందిస్తూ.. తమ మధ్య దూరానికి కారణం కొన్ని అపార్థాలేనని వెల్లడించారు. త్రిష స్వయంగా ముందుకు వచ్చి మాట్లాడటం ఎంతో మెచ్చుకోదగిన విషయమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి కనిపించడం చూస్తే.. గతంలో ఉన్న గ్యాప్ పూర్తిగా తొలగిపోయిందనే అభిప్రాయం.
ఇద్దరిదీ దాదాపు 23 ఏళ్ల సినీ ప్రయాణం. తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఈ ఇద్దరూ ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి రావడంతో పోలికలు, పోటీలు సహజంగానే వచ్చాయి. ఫ్యాన్ వార్స్, మీడియా కథనాలు ఈ ఇద్దరినీ ఎప్పుడూ పోల్చుతూ వచ్చాయి. ఒక దశలో నయనతార 'ఫ్రెండ్ అనేది చాలా పెద్ద పదం' అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో సంచలనంగా మారాయి. అయినప్పటికీ కాలం గడిచే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ ఈ పోటీ పెరిగిపోయింది.
తాజా ఫోటోలతో ఈ ఇద్దరూ తమ స్నేహంపై క్లారిటీ ఇచ్చినట్టు అర్థం అవుతుంది. పోటీని పక్కనపెట్టి, పరస్పర గౌరవంతో ముందుకు సాగితే స్నేహాలు చికురిస్తాయని ఈ రీయూనియన్ చాటుతోంది. 'దశాబ్దాలుగా ఎదురుచూసిన రీయూనియన్ ఇది', 'రూలింగ్ క్వీన్స్ టుగెదర్', 'ఇద్దరూ కలిసి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే చూడాలని ఉంది' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా ఈ పోస్ట్‌కు లైక్స్, హార్ట్ ఎమోజీలతో స్పందించారు.


Click it and Unblock the Notifications











