పెళ్లి తరువాత నయన్ హనీమూన్ ఉండదట.. విడిపోకుండా ఆ గుడిలో ప్రత్యేక పూజలు, ప్రమాణాలు!

నయనతార పెళ్లికి సంబంధించిన పుకార్లు కోలీవుడ్ మీడియాలో రోజుకోటి పూట్టుకొస్తున్నాయి. అయితే దాదాపు యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తోనే నయనతార పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న నయన్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు అతనితోనే విహారాయాత్రలు చేస్తూ సంతోషంలో మునిగి తెలుతోంది. షూటింగ్స్ లేకపోతే ఎక్కడికైనా విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇక త్వరలో పెళ్లి చేసుకోనున్న నయన్ ఈ సారి తన లవ్ బ్రేకప్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటోందట. గుడిలో ప్రత్యేక పూజలకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కెరీర్ మొదటి నుంచి..

కెరీర్ మొదటి నుంచి..

కెరీర్ మొదటి నుంచి కూడా నయనతార ఎదో ఒక వివాదంతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. ఇక ఆమెపై రూమర్స్ డోస్ ఎంత పెరిగినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టింది. ఒకవైపు ప్రేమలకు సంబంధించిన వ్యవహారాలతో ఇబ్బంది పడినప్పటికి నయన్ కృంగి పోకుండా కెరీర్ ని సరైన పద్ధతిలోనే కొనసాగించింది.

చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది

చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది

తన పర్సనల్ గొడవలు సినిమాపై ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడంలో ఆమె చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది. ఇక నయనతార క్రేజ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. శింబు, ప్రభుదేవాలతో కొన్నాళ్ళ పాటు ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పినప్పటికీ కూడా నయన్ ఎక్కువ రోజులు బాధ పడలేదు. ధైర్యంగా నిలబడింది. ఇక తనకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తోంది.

వీలైనంత త్వరగా పెళ్లి చెసుకోవాలని

వీలైనంత త్వరగా పెళ్లి చెసుకోవాలని

ఇక యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమ మొదలైనప్పుటి నుంచి కూడా నయన్ చాలా ఆనందంగా ఉంటోంది. ఇక అతన్ని ఏ మాత్రం వదులుకోకూడదని డిసైడ్ అయ్యింది. ఇక వీలైనంత త్వరగా పెళ్లి చెసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నయన్ పెళ్లిపై గత ఏడాది నుంచి రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దాదాపు ముహూర్తం ఫిక్స్ అయ్యింది అనేలా కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

హనీమూన్ క్యాన్సిల్

హనీమూన్ క్యాన్సిల్

అయితే పెళ్లికి ముందే ఎన్నో దేశాలు చుట్టేసిన ఈ ప్రేమ జంట పెళ్లి తరువాత హనీమూన్ వంటి వాటికి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మళ్ళీ తన జీవిత భాగస్వామి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఉండాలని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించనుందట.

Recommended Video

కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
ఆ ఆలయంలోనే ప్రత్యేక పూజలు

ఆ ఆలయంలోనే ప్రత్యేక పూజలు

సంప్రదాయాలను పెద్దగా పట్టించుకోని నయన్ తన స్నేహితురాలి సలహా మేరకు పెళ్లి తరువాత కుంభకోణం సమీపంలో ఉన్న తిరునాగేశ్వరం రాహు ఆలయానికి వెళ్లనున్నారట. అక్కడ హిందు సంప్రదాయం ప్రకారం నయనతార విగ్నేష్ శివన్ తో కలిసి ప్రత్యేక పూజలు, ప్రమాణాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X