Nayanthara Vignesh Shivan: కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార.. అప్పుడే పేర్లు కూడా పెట్టేసారు!

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో లేడి సూపర్​ స్టార్​గా పేరు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్​ నయనతార. సుమారు 17 ఏళ్లుగా సినీ రంగంలో విభిన్నమైన సినిమాలు చేస్తూ మాలీవుడ్​ టు టాలీవుడ్​ వయా కోలీవుడ్​ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ వస్తోంది. ఇటీవల కోలీవడ్​ డైరెక్టర్​ విఘ్నేష్​ శివన్​ను పెళ్లాడి, వివాహ బంధంలో మునిగితేలుతున్న నయనతార తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తనకు కవల పిల్లలు పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వారికి అప్పుడే పేర్లు కూడా పెట్టేసింది ఈ పాపులర్ హీరోయిన్. మరి నయనతార పిల్లల పేర్లేంటో తెలుసుకుందామా!

ప్రేమ, డేటింగ్‌ రూమర్లు..

ప్రేమ, డేటింగ్‌ రూమర్లు..

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ పాపులర్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ల మధ్య ప్రేమ, డేటింగ్‌ల మీద ఎన్ని రకాల రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. కొన్ని రోజులేమో.. ఈ ఇద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. ఇంకొన్ని రోజులేమో డేటింగ్‌లోనే ఉన్నారనే కథనాలు వచ్చాయి. ఇంతలోనే దోష నివారణ కోసం గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారని, త్వరలోనే వివాహాం చేసుకుంటారని వార్తలు వినిపించాయి. ఈ ప్రేమ, డేటింగ్, పెళ్లి పుకార్ల తర్వాత మొత్తానికి నయన్ విఘ్నేశ్ ఇద్దరూ కూడా జూన్‌ 9న వివాహా బంధంతో ఒక్కటయ్యారు.

మహాబలిపురంలో పెళ్లి వేడుకలు..

మహాబలిపురంలో పెళ్లి వేడుకలు..

మహాబలిపురంలో నయన్ విఘ్నేశ్ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. వీరిద్దరి పెళ్లికి కోలీవుడ్ నుంచి అతిరథ ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. ఇక ఈ వివాహానికి సంబంధించిన కాంట్రాక్ట్ నెట్ ఫ్లిక్స్ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసిందే. ఇటీవల వారి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్ లు హనీమూన్ కోసమని అనేక ప్రాంతాలు చుట్టివచ్చారు.

ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార..

తమ వివాహ బంధాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. ఫలితంగా నయన్ విఘ్నేష్ దంపతులకు పండంటి ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది నయనతార. అంతేకాకుండా అప్పుడే వాళ్లిద్దరికి పేర్లు కూడా పెట్టేసింది నయనతార. తన కవల పిల్లలను చిట్టి కాళ్లను ముద్దాడుతూ ట్విటర్ వేదికగా ఫొటో షేర్ చేసింది నయనతార.

తమ ప్రపంచమని..

ఈ ట్వీట్ లో ''అమ్మ నాన్నలం అయ్యాం. #Wikkinayan మగ కవల పిల్లలు జన్మించారు. ఉయిర్ అండ్ ఉలగమ్ పుట్టారు'' అని రాసుకొచ్చింది నయనతార. అయితే ఉయిర్ అంటే జీవితం అని ఉలగమ్ అంటే ప్రపంచం అని అర్థాలు వస్తున్నాయి. ఈ పేర్లతో తమ కవల పిల్లలు అంటే నయనతారకు అప్పుడే ఎంతో ప్రేమ ఉందో తెలుస్తోంది. వారిని తమ జీవితాలుగా, వారే తమ ప్రపంచమని చెప్పకనే చెబుతోంది నయనతార, విఘ్నేష్ శివన్ జంట. అయితే వీరిద్దరికి 4 నెలల కిందటే పెళ్లికాగా అప్పుడే పిల్లలు పుట్టడం ఏంటని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరోగసి ద్వారా ప్లాన్ చేశారేమో అని భావిస్తున్నారు.

వ్యాపారవేత్తగా మారాలాని..

ఇదిలా ఉంటే నయనతార తన యాక్టింగ్​ కెరీర్​కు ఎండ్​ కార్డ్​ వేసి వ్యాపారవేత్తగా మారాలాని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఇతర రంగాల్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు సినిమాలను కూడా నిర్మించాలను నయనతార భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారికంగా ప్రకటనంటూ ఏం లేదు గానీ, పుకార్లు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X