ఎట్టకేలకు పెళ్ళికి సిద్దమైన నయనతార.. ముహూర్తం, వేదిక ఫిక్స్.. ఎక్కడంటే?
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో నటించడమే కానీ ప్రమోషన్స్ సహా మరే ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనదు కానీ మాకు ఆమే కావాలంటూ ఎగబడుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. అంతే కాక సౌత్ హీరోయిన్స్ లో ఆమెదే ఇప్పటికీ పై చేయి. కేవలం షూట్ కు మాత్రమే హాజరయ్యే ఆమె కొట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక ఆమె అనేక మందితో పెళ్లి పీటలు దాకా వెళ్ళింది కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. ఇక చాలా కాలంగా ఆమె పెళ్లి గురించిన వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె పెళ్ళికి సమయం దగ్గర పడింది. నిజానికి చాలా కాలంగా గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటున్న ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. అయితే ఆమె చేసే సినిమాల కంటే ఎక్కువగా ఆమె తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ప్రేమ వ్యవహారాలు గురించి ఇప్పటికీ కధలు కధలుగా చెప్పుకుంటూ ఉంటారు. గతంలో తమిళ స్టార్ హీరో శింబు, ప్రభుదేవా లాంటి నటులతో నయనతార పెళ్లి పీటల వరకు వెళ్లి తరువాత ఎందుకో వద్దనుకుంది. నిజానికి ముందు శింబుతో పెళ్లి కన్ఫర్మ్ అనుకున్నారు.
నేడో రేపో మూడు ముళ్లు వేస్తారు అనుకుంటున్న తరుణంలో ఈ జంట విడిపోయింది. ఇక ప్రభుదేవాతో కూడా అంతే. ఆయన కోసం ఆమె మతం సైతం మార్చుకుంటే ఆమె కోసం భార్యను, పిల్లలను కూడా వదులుకోవడానికి సిద్దమయ్యాడు ప్రభుదేవా కానీ చివరికి ఈ రిలేషన్ కూడా పెళ్లి దాకా వెళ్ళలేదు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి యువ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో పీకల్లోతో ప్రేమలో ఉంది నయనతార. వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ లోనే ఉంటున్నారు. విఘ్నేష్ శివన్‌ని అప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది అంటూ వీరి పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ నయనతార ఆమె బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ పెళ్లి ముహూర్తం ఖరారు అయిందంటూ ప్రచారం జరుగుతోంది.

శనివారం నాడు తిరుమల శ్రీ వారిని నయనతార, విఘ్నేష్ శివన్ జంట దర్శించుకున్నారు. తిరుమలలో తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను నయనతార పెళ్లాడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వివాహ వేదికను బుక్ చేసేందుకు నయనతార తిరుమలకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ కూడా జూన్ 9న పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. .సినిమాల విషయానికి వస్తే ఇటీవలే నయనతార నటించిన 'కతువాకుల రెండు కాదల్' (తెలుగులో కన్మణి రాంబో ఖతీజా) విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా సమంత, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. ఇక నయనతార మెగాస్టార్‌తో కలిసి 'గాడ్‌ఫాదర్' చిత్రంలో నటిస్తుంది. హిందీలో అట్లీ-షారుఖ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. వీటితో పాటుగా తమిళంలో రెండు సినిమాలు మలయాళంలో ఒక సినిమాలో కూడా నటిస్తుంది. ఇక విఘ్నేష్ శివన్ అజిత్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











