Happy Birthday Nayanthara: ప్రేమ గాయాలను తట్టుకుని నిలబడిన లేడీ సూపర్ స్టార్.!

తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి దక్షిణాది మొత్తానికి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది నయనతార. కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని వరుస ఆఫర్లు అందుకుంది. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. ఒక భాషలో తప్పితే మరో భాషలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న నయనతార నేటితో 35వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను గుర్తు చేసుకుందాం.!

ఎవరి నోట విన్నా నయనతార పేరే

ఎవరి నోట విన్నా నయనతార పేరే

దాదాపు పదిహేడేళ్లుగా సినీ రంగంలో తన హవాను చూపిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. దక్షిణాదిలోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఆమె.. యంగ్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అలాగే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఫస్ట్ చాయిస్‌గా కనిపిస్తోంది. దీంతో భారీ సినిమాలను తెరకెక్కించే వాళ్లు నయనతార డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

తెలుగులోకి అలా ఎంట్రీ... సక్సెస్

తెలుగులోకి అలా ఎంట్రీ... సక్సెస్

కెరీర్ ఆరంభంలో నటించిన ‘గజినీ', ‘చంద్రముఖి' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు పరిచయం అయింది నయనతార. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ‘లక్ష్మీ'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా రికార్డులకెక్కింది.

లేడీ సూపర్ స్టార్.. అవార్డుల పంట

లేడీ సూపర్ స్టార్.. అవార్డుల పంట

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో నయనతార ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఆమె నటించిన అన్ని భాషల్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఎన్నో పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే, దాదాపు అన్ని రకాల జోనర్లలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకుంది. దీంతో నయన్ దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

పర్సనల్ లైఫ్‌లో వరుస షాకులు

పర్సనల్ లైఫ్‌లో వరుస షాకులు

కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన నయనతారకు పర్సనల్ లైఫ్‌లో మాత్రం వరుస షాకులు తగులుతున్నాయి. కెరీర్ ఆరంభంలో శింబుతో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లలేకపోయింది. ఆ తర్వాత ప్రభుదేవాతో చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్న నయన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అన్న సమయంలో బ్రేకప్ అయినట్లు ప్రకటించింది.

తోడు దొరికింది.. దూసుకుపోతోంది

తోడు దొరికింది.. దూసుకుపోతోంది

ప్రస్తుతం నయనతార.. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ఇక, విఘ్నేష్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత నయనతార దూసుకుపోతోంది. వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ఇలా సినీ కెరీర్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతోంది.

Recommended Video

కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
అంధురాలిగా మారిన నయనతార

అంధురాలిగా మారిన నయనతార

నయనతార ప్రస్తుతం పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో ‘నెట్రికన్' అనే మూవీలో ఆమె అంధురాలిగా చేస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ కూడా విడుదలైంది. దీనితో పాటు ‘అన్నత్తే', ‘కాతువాకుల రెండు కాదల్', ‘నిజాల్' అనే సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X