రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. షాక్‌లో కోలీవుడ్
సౌత్ బ్యూటీ నయనతార హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో రఫ్ ఆడిస్తూ బాక్సాఫీస్ వద్ద సింగిల్ హ్యాండ్‌తో ఫైట్ చేస్తున్నది. అయితే అందం, అభినయం కలబోసిన ఈ అందాల తారపై నిర్మాతలు, దర్శకులు భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె నటించిన సినిమా ప్రమోషన్ ఈవెంట్లకు మొహమాటం లేకుండా రానని తెగేసీ చెప్పడం సినీ ప్రముఖులకు మింగుడు పడని విషయంగా మారింది.
తాను నటించిన సినిమా ఫంక్షన్లకే హాజరుకానీ నయన.. ఇక సినిమాయేతర ఫంక్షన్లకు ముఖం చాటేయడం తెలిసిందే. అయితే సినిమా వేడుకలకు హాజరు కావొద్దని తనకు తాను పెట్టుకొన్న రూల్‌ను నయనతార బ్రేక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

సినీ ప్రముఖులందర్నీ షాక్‌కు గురిచేస్తూ.. ఉమెన్స్ డే సందర్భంగా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ చెన్నైలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో నయనతార హాజరుకావడం చర్చనీయాంశమైంది. అతిసాధారణమైన దుస్తుల్లో సాదాసీదా అమ్మాయిలా వేడుకలో మెరిసారు.

ఇటీవల ప్రముఖ ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ.. నా మనసులో ఏం ఉందోననే విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం లేదు. నా జీవితం అత్యంత ప్రైవేట్‌గా ఉండాలని కోరుకొంటాను. సభలో మాట్లాడటం నాకు చేతకాదు. చాలా సందర్బాల్లో నేనేదో మాట్లాడితే.. మరోలా తప్పుడుగా రాశారు. అలాంటి పరిస్థితిని హ్యాండిల్ చేయడం నాకు రాదు. నాకు నటించడమే తెలుసు. నేను నటించిన చిత్రాలు ప్రేక్షకులతో మాట్లాడుతాయి అని నయనతార అన్నారు.


Click it and Unblock the Notifications











