OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి నయనతార మూవీ.. కానీ ఓ తిరకాసు.. ఎక్కడ చూడోచ్చంటే?

గత కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఓటిటి ప్లాట్ ఫామ్ ల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడి ఉన్న సమయంలో ఇంట్లో ఉన్నవారికి ఈ ఓటిటి మాధ్యమాలే ఎంటర్టైన్మెంట్స్ అందించాయి. అయితే అప్పట్లో ఛాన్స్ లేక ఎన్నో సినిమాలు అనేక భాషల్లో పలు ఓటిటి యాప్స్ లో నేరుగా రిలీజ్ కి వచ్చేసాయి. అయితే ఇదే ట్రెండ్ థియేటర్స్ తెరుచుకున్నాక కూడా ఆగలేదు.

పలు చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ లం స్కిప్ చేసి ఓటిటిలో వచ్చేస్తున్నాయి. కాగా ఈ లిస్ట్ లో మన ఇండియన్ సినిమా నుంచి కూడా చాలా చిత్రాలు అప్పట్లో వచ్చినవి ఇప్పటికీ వస్తున్నవి కూడా చాలా ఉన్నాయి. అయితే సౌత్ ఇండియా సినిమా నుంచి ఓ స్టార్ హీరోయిన్ సినిమాలు రెండు ఈ కొన్నేళ్లలో నేరుగా డిజిటల్ రిలీజ్ కి వచ్చేసాయి. కాగా ఆ హీరోయిన్ నే నయనతార కాగా ఆమె నటించిన చిత్రాలు అమ్మోరు తల్లి ఇంకా అన్నపూరని చిత్రాలు హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లలో అందుబాటులోకి వచ్చాయి.

nayanthara controversial annapoorani finally in this ott platform

అయితే ఓటిటిలో అమ్మోరు తల్లి కి మంచి ఆదరణ వచ్చింది కానీ "అన్నపూరని" సినిమా మాత్రం విడుదల అయ్యిన ఒక్క రోజులోనే షాకింగ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బ తీసే సన్నివేశాలు ఇంకా లవ్ జిహాద్ ని ప్రోత్సహించే సీన్స్ ఉన్నాయి అంటూ దేశ దేశ వ్యాప్తంగా చాలా మంది పెద్ద రచ్చే చేసి ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని తీయించేసారు.

కాగా ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో నెట్ ఫ్లిక్స్ ఇంకా సింప్లి సౌత్ ఓటిటిలలో అందుబాటులోకి రాగ అప్పుడు జరిగిన కాంట్రవర్సీ దెబ్బతో తమ ప్లాట్ ఫామ్ లలో తొలగించారు. మరి మళ్ళీ ఏడు నెలల బ్యాన్ తర్వాత ఓటిటి లోకి నయనతార మరోసారి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈసారి ఈ చిత్రం మళ్ళీ అదే సింప్లి సౌత్ వారే అందుబాటులోకి తెచ్చారు. కాకపోతే ప్రస్తుతం ఈ చిత్రం యూఎస్ ఆడియెన్స్ కి మాత్రమే అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది.

nayanthara controversial annapoorani finally in this ott platform

అయితే ఇండియా వెర్షన్ మాత్రం ఇంకా ఎందులో అందుబాటులోకి రాలేదు. బహుశా మళ్ళీ వస్తే మళ్ళీ ఏదొక కాంట్రవర్సీ తలెత్తుంది అనేమో కానీ ప్రస్తుతానికి ఇండియాలో ఈ చిత్రాన్ని తీసుకురాలేదు. ఇంకా ఈ సినిమాలో ఆల్రెడీ నయనతారతో రాజా రాణి లాంటి సెన్సేషనల్ హిట్ లో నటించిన నటుడు జై ఈ సినిమాలో కూడా నయన్ బాయ్ ఫ్రెండ్ గా నటించగా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు.

మరి నయనతార ఇప్పుడు చాలా కాలం తర్వాత తెలుగులో భారీ చిత్రం "కన్నప్ప" సినిమాలో నటిస్తుండగా మంచు విష్ణు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమా సహా నయన్ అమ్మోరు తల్లి పార్ట్ 2 సహా కన్నడ స్టార్ నటుడు యష్ నటిస్తున్న బరి చిత్రం టాక్సిక్ తదితర సినిమాల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

More from Filmibeat

Read more about: nayanthara kannappa annapoorani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X