నయన్‌ని లేడి సూపర్ స్టార్ అనాల్సిందే.. కళ్ళు చెదిరేలా!
నయనతారని సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అనాల్సిందే. హీరోల సరసన రొమాన్స్ అయినా, లేడి ఓరియెంటెడ్ చిత్రాలైనా నయనతార దూసుకుపోతోంది. నయనతారకు రోజు రోజుకు సౌత్ లో క్రేజ్ పెరుగుతూనే ఉంది. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా నయన్ ప్రస్తుతం రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందట.
తాజా సమాచారం ప్రాతం నయన్ క్రేజ్ మరో స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో నటించేబోయే ఓ తమిళ చిత్రానికి గాను నయన్ 4.25 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా సంచలనమే. ఈ స్థాయిలో సౌత్ హీరోయిన్ రెమ్యునరేషన్ అందుకున్న అందుకున్న దాఖలాలు లేవు.

నయనతార ప్రస్తుతం తెలుగులో ప్రతిష్టాత్మకమైన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది. తమిళంలో అజిత్ సరసన విశ్వాసం చిత్రం చేస్తోంది. మరోవైపు కోకో కోకిల లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











