twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియల్ సూపర్ స్టార్.. సినీ కార్మికులకు అండగా.. భారీ సాయాన్ని ప్రకటించిన నయన్

    |

    కరోనా వైరస్ వచ్చి ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. మన దేశాన్ని కరోనా పట్టి పీడిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకూడదని, ఇంట్లోనే ఉండాలనే ప్రధాని ఆదేశాలను అందరూ పాటిస్తున్నారు. దీంతో రోజూవారి కూలీలు, దినసరి వేతనంపై ఆధారపడ్డవారి పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది.

     సినీ కార్మికులకు అండగా..

    సినీ కార్మికులకు అండగా..

    అయితే సినీ కార్మికులకు అండగా ఆయా సినీ పరిశ్రమలు ముందుకు వచ్చాయి. తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించిన సంగతి తెలిపింది. తాను ముందుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి.. మిగతా వారికి పిలుపునిచ్చాడు. చిరు పిలుపుతో విరాళాలు వెల్లువలా వచ్చాయి.

    దక్షిణ భారత సినీ కార్మికుల కోసం..

    దక్షిణ భారత సినీ కార్మికుల కోసం..

    దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)లోని కార్మికులను ఆదుకునేందుకు అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి విరాళాల కోసం పిలుపునిచ్చాడు. ఈ మేరకు రజినీకాంత్ ముందుకు వచ్చాడు. సినీ కార్మికులను ఆదుకునేందుకు యాభై లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఆపై మరి కొంత మంది యువ హీరోలు కూడా విరాళాలు ఇచ్చారు.

    స్పందించని హీరోయిన్స్..

    స్పందించని హీరోయిన్స్..

    అయితే అన్ని చోట్లా హీరోలే ముందుక రావడం, ఆర్థిక సాయాన్ని ప్రకటించడంతో హీరోయిన్స్‌పై విమర్శలు రావడం మొదలయ్యాయి. స్టార్ హీరోయిన్స్‌పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ మేరకు ప్రణీత ముందడుగు వేసి.. యాభై కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. లావణ్య త్రిపాఠి సినీ కార్మికుల కోసం లక్ష రూపాయలను డొనేట్ చేసింది.

    Recommended Video

    Balakrishna Donations To CCC and CM Relief Funds, See Chiranjeevi Reaction
    రూ.20 లక్షలు ప్రకటించిన నయన్..

    రూ.20 లక్షలు ప్రకటించిన నయన్..

    ఆర్కే సెల్వమణి పిలుపు మేరకు స్పందించిన సౌత్ లేడీ సూపర్ స్టార్ భారీ విరాళాన్ని ప్రకటించింది. ఇంతవరకు సౌత్ హీరోయిన్స్‌లో అత్యధిక మొత్తాన్ని (రూ. 20 లక్షలు) విరాళంగా ప్రకటించి రియల్ స్టార్ అనిపించుకుంది.

    English summary
    Nayanthara Donates 20 lakhs To FEFSI. To Help Cine Workers During Lock Down Time Nayanathara donates twenty Lakhs To FEFSI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X