ప్రతి సెకన్‌కూ 10 లక్షల రెమ్యునరేషన్.. స్టార్ హీరోలను తలదన్నేలా నయనతార పారితోషికం
దక్షిణాది సినీ ప్రేక్షకులకు నయనతార పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2 దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం చిత్రాల్లో వరుస సినిమాలు చేస్తూ అరించింది. ఇప్పటికీ భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇదే సమయంలో నయనతార ఓ యాడ్ షూట్ చేయడం, అందుకు ఆమె తీసుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. సెకండ్ల వ్యవధిలోనే ఉన్న ఆ కమర్షియల్ యాడ్ కు నయనతార కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ యాడ్ ఎంటీ? ఎన్ని సెకండ్లు ఉంది? మొత్తం ఎన్ని కోట్లు ఛార్జ్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
22 ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్..
తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో నయనతార సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2003లో మయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అక్కడ ఆరు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత 2005లో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 8 చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలోని చంద్రముఖి, గజిని, వల్లభ వంటి సినిమాలు తెలుగు వెర్షన్ లోనూ విడుదలై భారీ సక్సెస్ ను అందుకున్నాయి. దాంతో టాలీవుడ్ చిత్రాల్లోనూ అవకాశం దక్కింది. తొలుత లక్ష్మి, బాస్, యోగి, దుబాయ్ శ్రీను, తులసి, ఆంజనేయులు, అదుర్స్, శ్రీరామ రాజ్యం, రాజారాణి వంటి సపర్ హిట్ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

లేడీ సూపర్ స్టార్ గా నయనతార..
నయనతార తొలుత కెరీయర్ లో కాస్తా ఇబ్బంది పడింది. సరైన కథలు లభించక సక్సెస్ చూడటానికి కాస్తా సమయం పట్టింది. చంద్రముఖి, గజిని, లక్ష్మి, తులిసి, అదుర్స్ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. నాగార్జున, వెంకటేశ్, బాలయ్య, ప్రభాస్, జూ.ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే కోలీవుడ్, మాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించింది. ఇలా ఒక దశలో పీక్ స్టేజ్ కు వెళ్లింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందడంతో పాటు భారీ ఫాలోయింగ్ ను దక్కించుకోవడంతో నయనతారకు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కూడా దక్కింది.
సెకన్ కు రూ.10 లక్షలు..
నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటోంది. ఈ స్థాయిలో స్టార్ నటులు రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అయితే నయనతారకు భారీ ఫాలోయింగ్ ఉండటం విశేషం. దీంతో ఆమె తాజాగా నటించిన ఓ యాడ్ కు భారీగా ఛార్జీ చేసినట్టు తెలుస్తోంది. టాటా స్కై బిజినెస్ యాడ్ లో నటించేందుకు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందంట. ఈ యాడ్ 50 సెకండ్ల పాటు ఉంటుందని, ఒక్కో సెకన్ కు రూ.10 లక్షల చొప్పున ఛార్జీ చేసిందని సినీ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో నయనతార రెమ్యునరేషన్ స్టార్ హీరోలకే షాక్ ఇచ్చేలా ఉంది.
నయనతార రాబోయే చిత్రాలు..
ఇక నెక్ట్స్ నయనతార మెగాస్టార్ స్టార్ చిరంజీవి సరసన మెగా157తో అలరించబోతోంది. అలాగే యష్ సరసన టాక్సిక్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తోంది. అలాగే పలు భాషల్లో డియర్ స్టూడెంట్స్, హాయి, మన్నన్గట్టి సిన్స్ 1960, పేట్రియట్, మూక్తి అమ్మన్ 2, రక్కాయే వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











