స్టార్ హీరోకి నయన్ స్ట్రాంగ్ వార్నింగ్ .. డీప్‌గా డిస్ట్రబ్ చేసిన హీరో అతనేనా?

గడిచిన కొద్ది నెలలుగా నుంచి మన సౌత్ సినిమా దగ్గర ఒక్కో నెల ఏదొక కొత్త కాంట్రవర్సీ పుట్టుకు వస్తుంది అని చెప్పాలి. అలా ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యిన కాంట్రవర్సీ మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్ అండ్ స్టార్ హీరోయిన్ నయనతారదేనని చెప్పాలి. మాములుగా ఒక హీరో లేదా హీరోయిన్ నడుమ యుద్ధం జరగడం, ఈగో వార్స్ లాంటివి సినిమాల్లో చూసుంటాం కానీ నిజ జీవితంలో మాత్రం వీరిద్దరి నడుమ ఒక మినీ యుద్ధమే నడుస్తూ వస్తోంది.

నయనతార ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో పెళ్లి ఏజ్ దాటిపోయాక పెళ్లి చేసుకుంది. కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లాడిన ఈ టాప్ బ్యూటీ తమ పెళ్లిని భారీ మొత్తంలో ఓటిటికి అమ్మేసుకుంది. అయితే అక్కడే తనకి అసలు చిక్కు వచ్చి పడింది అని చెప్పాలి. కాగా నెట్‌ఫ్లిక్స్‌లో అనౌన్స్ చేసిన తన పెళ్లి డాక్యుమెంటరీలో తన సినిమాల్లో ఒకటైన "నానుమ్ రౌడీ దాన్" అనే సినిమాలో కేవలం మూడే సెకండ్స్ క్లిప్ కనిపిస్తుంది.

nayanthara gave strong warning to star hero indirectly

ఇదే తన కొంప ఇపుడు ముంచేసింది అని చెప్పాలి. కాగా నయనతారపై తన అనుమతి లేకుండా తన ప్రొడక్షన్ లో తెరకెక్కించిన సినిమా నుంచి క్లిప్ ని ఎలా వాడుకుంటారంటూ మండిపడ్డారు ధనుష్. తన అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో 3 సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు గాను నాకు 10 కోట్ల జరిమానా కట్టాలని ధనుష్ సైలెంట్ గానే నోటీసులు పంపాడు. కానీ దానికి నయన్ ఓపెన్ గా రెస్పాన్స్ ఇస్తూ ప్రెస్ నోట్ ఇవ్వడం దుమారం రేపింది.

ఇక దీంతో అక్కడ నుంచి వీరిద్దరి కాంట్రవర్సీ ఓ రేంజ్ లో ఎంటర్టైనింగ్ గా సోషల్ మీడియాలో మారిపోయింది. అయితే నయన్ ఇచ్చిన కౌంటర్‌కి ఏకంగా కోర్టు వరకు ఈ కేసుని తీసుకెళ్లాడు ధనుష్. ఇలా ఓ రేంజ్ లో నడుస్తున్న వీరి హీట్ ఆర్గ్యూమెంట్ నడుమ నయనతార పెట్టిన ఒక షాకింగ్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

nayanthara gave strong warning to star hero indirectly

ఇంతకీ అందులో ఏముంది అంటే .." కర్మ ఏం జెపుతుంది అంటే.. నువ్ ఒకరి జీవితాన్ని అబద్దాలతో నాశనం చేయాలని చూస్తే దానిని వారు అప్పుగా తీసుకుని మళ్ళీ దానిని నీకే వడ్డీతో సహా తిరిగి ఇస్తారు" అంటూ రాసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా అప్పుగా తీసుకుంటారు అనే మాటని అయితే గీత గీసి మరీ హైలైట్ చేసింది నయన్.

దీనితో ఇంతలా స్ట్రాంగ్ వార్నింగ్ ని ఇన్ డైరెక్ట్ గా ఇచ్చింది అంటే ధనుష్ కోసమే అని చాలా మంది అనుకుంటున్నారు. అంటే ధనుష్ మాత్రం నయనతారని బాగా డీప్‌గానే హర్ట్ చేసి ఉంటాడని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి చూడాలి ఈ ఇద్దరి నడుమ సాగుతున్న ఈ యుద్ధంలో తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X