రూటు మార్చేసిన నయనతార.. అందాలకు పదును పెట్టేస్తూ హాట్ హాట్‌గా!

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార.. గత కొంతకాలంగా ఎక్స్ పోజింగ్‌కు కాస్త దూరంగానే ఉంటోంది. ఒకప్పుడు చేసినంత స్కిన్ షో ఇప్పుడు చేయడం లేదు. గతంలో వల్లభ, సెల్యూట్ లాంటి సినిమాల్లో ఆమె చేసిన గ్లామర్ షోకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత అదే రేంజ్‌లో తమిళ 'బిల్లా'లో బికినీ వేసి అందరి మతి పోగొట్టింది. తాజాగా మరోసారి అలాంటి ప్రయోగమే చేసింది నయన్. ఆ సంగతులు చూద్దామా..

బిల్లాలో బికినీతో నయన్..

బిల్లాలో బికినీతో నయన్..

ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలను సాధిస్తోంది నయనతార. తమిళంతో చాలా సినిమాలు చేస్తున్న నయన్.. తెలుగులో అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తోంది. తనను తీసుకురావాలంటే తెలుగు ప్రొడ్యూసర్లకు చాలా కష్టమవుతోంది. తమిళ నాట నయన్ యమా జోరుగా దూసుకుపోతుండటంతో..టాలీవుడ్ వైపు అంతగా చూడటం లేదు.

ప్రమోషన్లకు రాని నయన్..

ప్రమోషన్లకు రాని నయన్..

సినిమాల్లో నటించడం వరకే తన బాధ్యత.. నయన్ ప్రమోషన్లకు రాదు. బయట ఫంక్షన్లలో ఎక్కడా కనబడదు. ఉంటే ప్రియుడు విఘ్నేష్ శివన్ తో ఉంటుంది.. లేదా సినిమాల్లో బిజీగా ఉంటుంది. అంతేకాని బయట హడావిడి చేయదు. దీంతో నయన్ అభిమానులకు మసాలా డోస్ తక్కువైపోయింది. తాజాగా ఆ లోటును పూడ్చింది నయన్.

నయన్ హాట్ పిక్స్..

నయన్ హాట్ పిక్స్..

అయితే తాజాగా వోగ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఓ హాట్ ఫోటో షూట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలను నయన్ అభిమానులు షేర్ చేసుకుంటూ సంబర పడుతున్నారు.

అలంటి కథలు వద్దు..

అలంటి కథలు వద్దు..

ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన దగ్గరకి కథలు చెప్పడానికి వచ్చిన దర్శకులకు కొన్నిసలహాలు ఇస్తుంటారట. సోలో హీరోయిన్ కథలైతే.. మొత్తం తానే నిర్ణయం తీసుకుంటానని, అలాంటి వాటిలో కూడా కొన్ని వేరే కథలను చొప్పిస్తుంటారు..లవ్ ట్రాక్ అని అలా ఇలా.. అయితే అలాంటివి అవసరమా? అని డైరెక్టర్స్ తో నిర్మోహమాటంగా చెబుతానని తెలిపింది.

తాజాగా సైరాతో..

తాజాగా సైరాతో..

తాజాగా సైరా నరసింహా రెడ్డి సినిమాలో సిద్దమ్మ పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో కానీ, సక్సెస్ మీట్లో కానీ నయన్ ఎక్కడా కూడా పాల్గొనలేదు. నయన్ ప్రస్తుతం తన ప్రియుడి నిర్మాణంలో ఓ హారర్ మూవీని చేస్తున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X