‘ఇంతకీ నిన్ను ఎవరైనా చూస్తారా..’: స్టార్ హీరోయిన్ పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ స్టార్ హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారంట. ఆ కామెంట్స్ చేయడంతో ఆ అమ్మడు మేకప్ వేయడం మానేసిందట. ఇంతకీ ఆ సార్ట్ హీరోయిన్ ఎవరు? ఏ మూవీ షూటింగ్ సమయంలో..ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ను జూనియర్ ఎన్టీఆర్ ఏమని కామెంట్స్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఓ లూక్కేయండి.

ఆ బ్యూటీ ఎవరో కాదు. లేడీ సూపర్ స్టార్‌గా పేరు దక్కించుకున్న హీరోయిన్ నయనతార. వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసి కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీ కళాశాల రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే మలయాళీ దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' లో మొదటిసారిగా సినిమా అవకాశం ఇచ్చాడు. అస్సలు సినీ ఇండస్ట్రీ వైపు వెళ్లొద్దనుకున్నా ఈ నటికి సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత నయనతారకు స్మయతుంబట్టు, రాప్పకల్, తస్కర వీరన్, వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి అగ్ర హీరోల సరసన నటించింది.

Nayanthara interesting comment on Jr NTR Dance during the adhurs movie shooting

తర్వాత నయనతార టాలెంట్‌తో చంద్రముఖి, గజిని, లక్ష్మీ,దుబాయ్ శీను, లక్ష్మీ, బాస్, శివాజీ, తులసి, అదుర్స్, అనామిక, బాబు బంగారం, అమ్మోరు తల్లి, పెద్దన్న, గాడ్ ఫాదర్, ఓ2.. అలాగే శ్రీరామరాజ్యంలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. శ్రీరామరాజ్యం చిత్రానికి నయనతారకు ఏకంగా ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు కూడా దక్కాయి. ఇక నయన్ వ్యక్తిగత విషయాలు చూసినట్లైతే..వల్లవన్ షూటింగ్ క్రమంలో తోటి నటుడు శింబుతో లవ్ లో పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పమన్నాయి. కానీ తర్వాత వీరిద్దరు విడిపోయినట్లు చర్చించుకున్నారు. తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో ప్రేమలో పడిందని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వీరి వార్తలు పెద్ద దుమారమే రేపాయి.

కానీ కారణం ఏంటో తెలియనప్పటికీ ప్రభుదేవా అండ్ నయనతార కూడా విడిపోయారు. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ ను పెళ్లి చేసుకుని.. సరోగసీ ద్వారా నయన్ పండండి మగ కవలలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం విఘ్నేష్ అండ్ నయన్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నయనతార పిల్లలకు సంబంధించి ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూనే ఉంటుంది.

ఇక పోతే నయనతార ఓ ఇంటర్వ్యూకు మాట్లాడుతూ.. అదుర్స్ మూవీ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తనపై కామెంట్ చేశాడంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.అవేంటో ఇప్పుడు చూద్దాం.. నయనతార ఫేస్ కు టచ్ పట్ చేసుకుంటే.. ఎన్టీఆర్ పక్కనే నిలబడి అదే తీరుగా చూస్తున్నారని, దీంతో నయన్ ఏంటి? అలా చూస్తున్నారని తారక్ ను అడగ్గా.. ఎందుకంత మేకప్ వేసుకుంటున్నారు అని అన్నారని తెలిపింది. దానికి నయన్.. సాంగ్ షూట్ లో అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాలిగా మరీ అని సమాధానం ఇచ్చానని పేర్కొంది.

Nayanthara interesting comment on Jr NTR Dance during the adhurs movie shooting

'నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా జనాలంతా నన్నే చూస్తారు' ఎన్టీఆర్ సెటైరికల్ గా సమాధానమిచ్చారట. దీనికి మరీ మన చారీ లుక్, గెటప్ అలా ఉంటుందనీ అన్నానని హీరోయిన్ వెల్లడించింది. దీంతో అక్కడున్నవారంతా నవ్వారంటూ నయనతార ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం నయనతార కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయనతార అండ్ జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన అదుర్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

More from Filmibeat

Read more about: nayanthara junior ntr adhurs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X