మరో వివాదంలో నయనతార.. ఆ సినిమా మధ్యలోనే వెళ్లిపోయిందా?
ఏ సినీ పరిశ్రమలో అయినా కూడా కేవలం కొంతమంది హీరోయిన్స్ కి మాత్రం హీరోస్ తో ధీటుగా మంచి ఆదరణ మార్కెట్ లు ఉంటాయని చెప్పవచ్చు. దాదాపు అన్ని భాషల్లో కూడా ఇలాంటి హీరోయిన్స్ కనిపిస్తారు. కాగా ఇలా తెలుగులో సహా తమిళ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో నటి నయనతార కూడా ఒకామె అని చెప్పవచ్చు. కాగా నయనతార తన కెరీర్ హీరోయిన్ గానే స్టార్ట్ చేసినప్పటికీ ఇపుడు మాత్రం తనకి సెపరేట్ మార్కెట్ ని సొంతం చేసుకుంది.
అంతే కాకుండా ఇప్పటికీ తనతో సోలో సినిమాలు చేసేందుకు నిర్మాతలు వెయిట్ చేస్తుంటారు. మరి ఇంత మార్కెట్ ఆమెకి ఉన్నప్పటికీ నయన్ మాత్రం పలు వివాదాల్లో కూడా తరచు కనిపిస్తూ ఉంటుంది. కాగా మొదటి నుంచి కూడా తన ప్రేమ వ్యవహారాలు ఆ తర్వాత బ్రేకప్ ఇంకా పలు సినిమాల పరంగా కూడా ఎప్పటికప్పుడు నయన్ కొత్త కాంట్రవర్సీ లలో కనిపిస్తుంది.

కొన్ని నెలలు కితమే స్టార్ హీరో ధనుష్ తో ఆమె పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో 10 కోట్ల రచ్చ ఇప్పుడుకీ నడుస్తుంది. ధనుష్ పై పలు షాకింగ్ పోస్ట్ లు కూడా పెట్టిన నయన్ ఇపుడు కొత్త వివాదంలో ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. కాగా పెళ్లి లైఫ్ తర్వాత నయన్ తన భారీ సినిమా ఒకటి రీసెంట్ గానే స్టార్ట్ చేసింది. ఆమె సోలోగా నటించి హిట్ అయ్యిన చిత్రాల్లో అమ్మోరు తల్లి సినిమా కూడా ఒకటి.
తమిళ్ లో మూకుతి అమ్మన్ గా వచ్చిన ఈ చిత్రం అక్కడ సహా తెలుగులో కూడా నేరుగా ఓటిటిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆర్ జే బాలాజీ కూడా నటించిన ఈ చిత్రంకి సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ ఈ మార్చ్ లోనే ఆరంభం అయ్యింది. అమ్మోరు తల్లి 2 గా ఈ చిత్రం రానుండగా ఈ సినిమా షూటింగ్ మధ్య లోనుంచే ఇపుడు ఈమె వాక్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది.
కాగా ఇందుకు కారణం సెట్స్ లో ఆమెకి ఈ సినిమా దర్శకుడు అసిస్టెంట్ దర్శకునికి జరిగిన వాగ్వాదం అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో నయన్ పై కూడా పలు కామెంట్స్ వినిపించగా అసలు దీనిపై ఇపుడు క్లారిటీ బయటకి వచ్చింది. తమిళ్ లో అరణ్మణై సినిమాలు తెరకెక్కించే దర్శకుడు సుందర్ సి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా తన భార్య, నటి అలాగే నిర్మాత ఖుష్భు ఈ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చారు.
నయన్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె తిప్పి కొట్టి సినిమా షూటింగ్ అంతా ఇపుడు చాలా స్మూత్ గా నడుస్తుంది అని సో అలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దు అందరూ రిలాక్స్ గా ఉండి ఇంకో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూడండి అంటూ క్లారిటీ ఇచ్చారు. దీనితో నయన్ కొత్త కాంట్రవర్సీపై ఒక ముగింపు వచ్చింది.


Click it and Unblock the Notifications











