73 ఏళ్ళ హీరోతో జతకట్టనున్న లేడీ సూపర్ స్టార్.. భారీ మల్టీస్టారర్ మూవీలో నయనతార..
Narayanan: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఓ టీవీ యాంకర్ నుండి కెరీర్ ప్రారంభించి, ఆ ఫేమ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రత్యేకంగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇలా తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి వరుస విజయాలను అందుకుంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ మళయాళి కుట్టి తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటు సౌత్ లో అటు నార్త్ లో సూపర్ పామ్ లో ఈ అమ్మడు 73 ఏళ్ళ స్టార్ హీరోతో జతకట్టనున్నదట. భారీ మల్లీస్టారర్ మూవీలో లేడీ సూపర్ స్టార్ భాగం కానున్నదంట. ఆ వివరాల్లోకెళ్తే..
స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాధారణ టీవీ యాంకర్ నుండి కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. ఈ క్రమంలోని తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన పవర్ ఫుల్ పాత్రలతో 'లేడీ సూపర్ స్టార్'గా గుర్తింపు పొందింది. సౌత్ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాది హీరోయిన్లలో ఆమెనే హాయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు.

తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దర్శకుడు మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతుందట. ఈ సినిమాలో మెగాస్టార్ ముమ్మటి , కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ స్కీన్ షేర్ చేసుకోబుతున్నారు.
మలయాళం లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముమ్ముట్టి,మోహన్‌లాల్ లు కలిసి నటిస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ లెజెండ్స్ తో పాటు, ప్రముఖ నటులు ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయకిగా నటిస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్ సినిమాను సి.ఆర్.సలీం, సుభాష్ జార్జ్ మాన్యుయెల్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం షూటింగ్ శ్రీలంకలో జరిగిందట. మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్‌లోనూ జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టి,మోహల్ లాల్, నయనతార కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మలయాళ సినిమాలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాపై సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. 50 చిత్రాల్లో భిన్న పాత్రల్లో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించిన మమ్ముట్టి, మోహన్‌లాల్ చివరిగా 2013లో 'కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి' అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొచ్చిలో జరుగుతోంది. ఈమూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టికి జంటగా నటిస్తోంది నయన్. వీరిద్దరు షూటింగ్ సెట్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో నయనతార - మమ్ముట్టి కాంబినేషన్‌లో మూడు సినిమా వచ్చాయి. వీరిద్దరు మొదటి సారి 'రాప్పకల్' సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత 2015లో 'భాస్కర్ ది రాస్కల్', 2016లో 'పుతియ నియమం' జంటగా నటించారు. తాజాగా ఈ కాంబినేషన్ నాల్గవ సారి కలుస్తుండటంతో అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











