పెళ్లి విషయంలో చేతులెత్తేసిన ప్రియుడు: నయనతార పరిస్థితి ఇలా తయారైందేమిటి?

By Manoj

ఏ ఒక్క భాషకో పరిమితం కాకుండా... దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లో నటిస్తూ తన హవాను చూపిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అందంతో పాటు అద్భుతమైన నటనను కనబరచగల నైపణ్యం ఉండడంతో ఫిల్మ్ మేకర్లు అందరూ ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఫలితంగా సౌతిండియాలోనే భారీ స్థాయిలో డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా ఆమె ఖ్యాతి గడించింది. ఇదంతా ఒకవైపు మాత్రమే.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం నయన్‌కు అంతగా కలిసి రావడంలేదు. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో తాజాగా ఆమెకు ఊహించని పరిస్థితి ఎదురైందట. ఆ వివరాలు మీకోసం.!

వాళ్లకు ముందుగా గుర్తొచ్చే పేరు ఆమెదే

వాళ్లకు ముందుగా గుర్తొచ్చే పేరు ఆమెదే


తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇలా అన్ని భాషల్లో నటిస్తూ సత్తా చాటుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. దక్షిణాది మొత్తం పాపులారిటీని సొంతం చేసుకున్న ఆమె డేట్స్ కోసం ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా భారీ చిత్రాలను తెరకెక్కించే వారికి ముందుగా గుర్తొచ్చే పేరు ఆమెదే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోంది

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోంది


అన్ని భాషల్లో క్రేజ్ ఉండడానికి తోడు టాలెంటెడ్ హీరోయిన్ కావడంతో నయనతారకు మంచి డిమాండ్ ఉంది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో ఆమె వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చే ఫిల్మ్ మేకర్లకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో చేసేదేమీ లేక చాలా మంది ఆమెకు ఓకే చెప్పేస్తున్నారు.

వ్యక్తిగతం జీవితంలో మాత్రం ఫెయిల్యూర్

వ్యక్తిగతం జీవితంలో మాత్రం ఫెయిల్యూర్

కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అవుతోన్న నయనతార... వ్యక్తిగతంగా మాత్రం ఫెయిల్యూర్ అనే పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఆమె జీవితంలోకి ఇద్దరు ప్రముఖులు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అందులో ఒకరు... స్టార్ హీరో శింబు కాగా, మరొకరు... యాక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. వీళ్లిద్దరితోనూ ప్రేమాయణం సాగించిన నయన్.. పెళ్లి మాత్రం చేసుకోలేకపోయింది.

నయనతార జీవితంలోకి మరో ప్రముఖుడు

నయనతార జీవితంలోకి మరో ప్రముఖుడు

ఇప్పటికే రెండు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలను అనుభవించిన నయనతార... కొన్నేళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ‘నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. ఇప్పటికీ కొనసాగుతోంది. చాలా కాలం పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట.. ఇప్పుడు డైరెక్టుగానే ట్రాక్ నడుపుతోంది.

అస్సలు తగ్గట్లేదు.. ఎక్కడ చూసినా వీళ్లే

అస్సలు తగ్గట్లేదు.. ఎక్కడ చూసినా వీళ్లే

ప్రేమ గురించి ఎవరికీ తెలియనంత వరకూ రహస్యంగా తిరిగిన నయనతార, విఘ్నేష్... బహీర్గతం అయినప్పటి నుంచి మాత్రం రెచ్చిపోతోన్నారు. తరచూ కలుసుకోవడం.. వాటికి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు, ఇటీవల ఈ జంట దేవాలయాల సందర్శన కూడా చేసింది. విడిపోకుండా ఉండేందుకు ఇలా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

దాని కోసం నయనతారపై విఘ్నేష్ ఒత్తిడి

దాని కోసం నయనతారపై విఘ్నేష్ ఒత్తిడి


ఎప్పటి నుంచో ప్రేమాయణం సాగిస్తోన్న నయనతార.. విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని విఘ్నేష్‌పై అతడి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో అతడు నయన్‌ను ఒప్పించాడని ప్రచారం జరిగింది.

Recommended Video

Nayanthara & Prabhudeva Pair Up For A Movie ?
పెళ్లి విషయంలో చేతులెత్తేసిన ప్రియుడు

పెళ్లి విషయంలో చేతులెత్తేసిన ప్రియుడు

లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికే పెళ్లి పీటలెక్కేసేశారు నయన్, విఘ్నేష్. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వివాహం చేసుకోవాలని ఈ ఇద్దరూ డిసైడ్ అయ్యారట. అయితే, లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకోవడంపై విఘ్నేష్ చేతులెత్తేశాడట. దీంతో చిన్న గుడిలో తంతు పూర్తి చేద్దామని నయన్ ఓ ప్రతిపాదన ఉంచిందని, దానికి అతడితో పాటు అందరూ ఓకే చెప్పారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X