‘నమితతో నాకు అలాంటి అనుభవం.. త్రిషతో అలాంటి రిలేషన్ లేదు’

సినిమా ఇండస్ట్రీలో తారల మధ్య విభేదాలు ఉంటాయనే వార్తలు పుష్కలంగా కనిపిస్తుంటాయి. దక్షిణాదిలో అగ్రతారలు మధ్య అంతర్గత కలహాలను వారి అభిమానుల సీరియస్‌గానే తీసుకొంటారు. అయితే ముఖ్యంగా తమిళ, మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల మధ్య కలహాలు మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుంటాయి. ఈ కోవలోనే త్రిషా కృష్ణన్, నయనతార మధ్య విభేదాలు భారీ చర్చకు దారి తీశాయి. త్రిష, ఇతర హీరోయిన్లతో తన విభేదాల గురించి ఇచ్చిన సౌత్ స్టార్ హీరోయిన్, లేడి సూపర్ స్టార్ నయనతార ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళంలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌తో విభేదాలు గానీ.. ఇతర హీరోయిన్లతో నాకు ఎలాంటి కలహాలు లేవు. ప్రతీ ఒక్కరితో నేను పర్సనల్‌గా కాకుండా ప్రొఫెషనల్ రిలేషన్స్ మెయింటెన్ చేస్తాను. వారితో మంచి రిలేషన్స్‌ను కొనసాగిస్తాను. ఏ ఒక్కరితో నాకు ఎలాంటి విభేదాలు, పోటీ లేదు. ప్రతీ ఒక్కరు వారి వారి కెరీర్‌ను ప్రొఫెషనల్‌గా కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు అని నయనతార అన్నారు.

Nayanthara opened about Differences with Trisha Krishnan Namitha

నేను చాలా తక్కువ మీడియాతో మాట్లాడుతాను. నా సినిమాల ప్రమోషన్స్‌ కూడా ఎక్కువగా చేయను. ఆ సినిమాకు అవసరమైతే తప్ప ప్రమోషన్స్‌లో పాల్గొనను. సినిమా రిలీజ్ గురించి, సినిమాలో ఉండే అంశాలను మాత్రమే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ సినిమాకు ఆ విషయాలే చెప్పాలి. అందులో కొత్తగా ఏమీ ఉండవు. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటాను. దాంతో మీడియాకు కూడా దూరంగా ఉంటాననే అభిప్రాయం అందరిలో నెలకొన్నది అని నయన తార చెప్పారు.

భిల్లా షూటింగులో హీరోయిన్ నమితతో నాకు సరిగా కుదర్లేదు. ఆరంభంలో నాతో ఆమె బాగానే ఉంది. కానీ సడెన్‌గా ఓ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేసింది. నన్ను చూడటం, పలకరించడం చేయలేదు. నన్ను పూర్తిగా సెట్లో ఇగ్నోర్ చేసింది. ఆమె ప్రతీ ఒక్కరిని పలకరించేది. కానీ నన్ను మాత్రం పలకరించకపోయేది. ఆ విషయం నాకు నచ్చలేదు. అది ఆమెకు సంబంధించిన సమస్యని వదిలేశాను అని నయనతార అన్నారు.

త్రిషతో కూడా నా రిలేషన్ సరిగానే ఉంది. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయాన్ని అతిగా మీడియాలో వాడారు. కానీ నాకు అంతగా ఆమెతో ఫ్రెండ్ షిప్ లేదు. ఒకరికొకరు పరిచయస్తులుగా, ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేసుకొంటాం. దాంతో మహిళలకు ఒకరి అంటే మరొకరికి పడదు అనే ప్రచారం మీడియాలో జరిగింది. అంతేగానీ నాకు ఏ ఒక్కరితో ఎలాంటి ఇష్యూస్ లేవు అని నయన్ చెప్పారు.

నయనతార సినిమా కెరీర్ విషయయానికి వస్తే.. 2023 సంవత్సరంలో అన్నపూర్ణ: ది గాడెస్సెస్ ఆఫ్ ఫుడ్, జవాన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 2025 సంవత్సరంలో టెస్ట్, టాక్సిక్, మన్నన్‌గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, రాక్కయిఏ, మూకుతి అమ్మన్ 2 సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం జవాన్ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X