40 ఏళ్ల వయసులో తగ్గని నయనతార.. శ్వేత వర్ణ అందాలతో..
మేల్ డామినేషన్ ఉండే సినీ పరిశ్రమలో స్టార్స్‌కే చుక్కలు చూపెడుతూ దూసుకెళ్తున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార. ఒకానొక దశలో కెరీర్‌లో ఎదురుదెబ్బలు, లవ్ ఫెయిల్యూర్స్, ఎన్నో కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి తన పేరునే ఓ బ్రాండ్‌గా మార్చి కోట్ల వ్యాపారం జరిగే స్థాయికి చేరుకున్నారు నయన్. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌లలో ఒకరిగా నయనతార వెలుగొందుతున్నారు. ఎంత పెద్ద హీరోలు అయినా సరే ఆమె కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆమె స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
2003లో మనస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నయనతారకు చంద్రముఖి సినిమా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసపెట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకొచ్చారు. ఈ దశలో వెను వెంటనే శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం బెడిసికొట్టడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన నయనతార తిరిగి కోలుకున్నారు. కెరీర్‌లో మళ్లీ బిజీ అయిన ఆమె బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో సత్తా చాటారు. వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్లను మించిన కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను వణికించారు.

అలాంటిది ఆమె జీవితంలోకి యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంట్రీ ఇచ్చాడు. 2015లో నేను రౌడీనే సినిమా షూటింగ్ సమయంలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమాయణం సాగించింది. 2022 జూన్ 9న చెన్నైలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. చాలా మంది నయనతారకు పొగరని, యాటిట్యూడ్ చూపిస్తుందని .. షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తుందని, ప్రమోషన్స్‌లో పాల్గొనదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల నయనతార - ధనుష్ మధ్య జరిగిన కాంట్రవర్సీ కోర్టు వరకు వెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హిందీలో సికిందర్, తని ఒరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, టాక్సీక్, ముక్తి అమ్మన్ 2, మహారాణి తదితర చిత్రాలలో నయనతార నటిస్తున్నారు. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఇప్పటికీ క్యూకడుతున్నారంటే నయన్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ ట్రెండ్స్, ఫ్యాషన్ విషయంలో అప్ టు డేట్‌గా ఉంటారు నయనతార.
కొద్దిరోజుల క్రితం సంక్రాంతిని పురస్కరించుకుని తెలుపు రంగు ఐవరీ కుర్తాలో మెరిసిపోతూ నయనతార చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెగ్యులర్ వైడ్ లెగ్ ట్రౌజర్స్ , పలాజోలకు బదులుగా ఆమె క్లాసిక్ చుడిదార్ ప్యాంట్‌లను ఎంచుకున్నారు. స్లీవ్ లెస్ షోల్డర్స్‌ను కవర్ చేయడానికి సిల్క్ కాటన్ దుపట్టాను ధరించారు. ఇక యాక్సెసరీల విషయానికి వస్తే.. చాంద్‌బలిస్, ఉగరం, సింపుల్ వాచ్, లేత గోధుమ రంగు కొల్హాపురి హీల్స్‌తో మ్యాచ్ చేశారు. నిజానికి నయనతారకు సాంప్రదాయ దుస్తులంటేనే ఇష్టం. గతేడాది నవరాత్రి సందర్భంగా ఎరుపు రంగు చీర కట్టి అందరినీ ఆకట్టుకున్నారు నయన్.


Click it and Unblock the Notifications











