అతడి కోసం సర్వం త్యాగం చేశా.. నన్ను నేను అలా చంపేసుకొన్నా.. నయనతార

హీరోలకే సవాల్ విసురుతూ, దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార. అది కూడా నెంబర్ వన్ హీరోయిన్‌గా. 2003లో మానస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టారు నయన్ అలియాస్ డయానా మరియమ్ కురియన్.. 20 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో క్లాసిక్స్‌లో నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. సినిమాల కంటే వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార.

100 సినిమాల దిశగా నయన్
దక్షిణాదిలోని అందరూ అగ్రహీరోల సరసన నటించిన నయనతార.. ఈ తరంలో 75కు పైగా సినిమాలు కంప్లీట్ చేసుకుని 100 సినిమాల వైపు దూసుకెళ్తున్నారు. దూకుడు స్వభావం, ముక్కుసూటితనం, ఆటిట్యూడ్‌ అంటూ నయనతార విషయంలో ఇండస్ట్రీ నుంచి తరచుగా వినిపించే మాటలు. ఎవరు ఏమనుకున్నా.. మనసులోని విషయాన్ని కుండబద్ధలు కొడతారు నయనతార. 40 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రభామలకు పోటీ ఇస్తున్నారు లేడీ సూపర్‌స్టార్.

Nayanthara Prabhu Deva Breakup Lady Super Star opens up on her past love story with Choreographer

నయన్ డైరీ ఫుల్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీలో, యశ్ నటిస్తోన్న టాక్సిక్‌లో, మన్నన్‌గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, పెట్రియాట్, మూకుతి అమ్మన్ 2, హాయ్, రక్కాయే సినిమాలలో నయనతార నటిస్తున్నారు. ఇవికాక మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. హీరోయిన్‌గా బయటి సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ మరి అద్భుతమైన చిత్రాలను నిర్మించి ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తున్నారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో కోట్లలో సంపాదిస్తున్నారు లేడీ సూపర్‌స్టార్. నయనతార డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

విఘ్నేష్ శివన్‌తో పెళ్లి
నానుమ్ రౌడీ ధాన్ సినిమా సమయంలో యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయన్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దల అంగీకారంతో 2022 జూన్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నయనతార.. ప్రస్తుతం భర్త, పిల్లలతో జీవితాన్ని ఎంజయ్ చేస్తున్నారు. ఇటీవల నయనతార- విఘ్నేష్ శివన్‌లు విడిపోతున్నట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆ వెంటనే స్పందించిన నయన్.. భర్త, పిల్లలతో కలిసి మురుగన్ ఆలయానికి వెళ్లి పుకార్లకు చెక్ పెట్టారు.

ప్రభుదేవాతో పెళ్లి వరకు
అయితే నయనతార జీవితంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది. శింబుతో బ్రేకప్ జరిగిన కొద్దిరోజులకే ప్రభుదేవాతో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కానీ అనూహ్యంగా వీరి పెళ్లి రద్దయ్యింది. పెళ్లి వరకు వెళ్లిన నయనతార- ప్రభుదేవాలు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ ఓ మిస్టరీయే. అయితే ప్రభుదేవా కారణంగానే నయన్ ఈ పెళ్లికి చివరి నిమిషంలో నో చెప్పారని అంటారు. క్రిస్టియన్‌గా ఉన్న నయన్‌ను మతం మారాలని, పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని, పూర్తిగా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుదేవా కండీషన్ పెట్టారట. దీనికి నయన్ అంగీకరించారట.

Take a Poll

ఆ కారణంతోనే ప్రభుదేవాతో బ్రేకప్
అయితే పెళ్లి తర్వాత తన మొదటి భార్య పిల్లలు మనతోనే ఉంటారని ప్రభుదేవా చెప్పడంతో నయన్ తట్టుకోలేకపోయారని అందుకే ఆయనతో పెళ్లిని రద్దు చేసుకోకూడదని నిర్ణయించుకున్నారని కోలీవుడ్ టాక్. ప్రభుదేవాతో రిలేషన్‌పై పలుమార్లు నయనతార ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసేవారు. అతని కోసం తన కెరీర్, కలలు, ఆశలు, సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డానని.. అయితే బ్రేకప్ వల్ల తనకు మంచే జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X