హైదరాబాద్‌లో ల్యాండైన నయనతార.. అన్నాత్తే కోసం లేడీ 'బిల్లా'లా హొయలు!

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో చివరిగా సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ తమిళంలో మాత్రం బిగిల్, దర్బార్, మూకుత్తి అమ్మాన్ లాంటి సినిమాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతానికి ఆమె ఇప్పుడు మూడు తమిళ సినిమాల్లో నటిస్తోంది అందులో ఒకటి రజనీకాంత్ సరసన అన్నాత్తే సినిమా. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న అన్నాత్తేకి శివ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసుల సంఖ్య పెరగడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ విధించింది.

మొదటిసారి ఘాటుగా దర్శనమిచ్చిన శివాత్మిక రాజశేఖర్

అయితే 'అన్నాత్తే' సినిమా వారం పాటు నైట్ షెడ్యూల్లో షూటింగ్‌ జరుపుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో చిత్రబృందం రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌ పోలీసుల నుంచి రాత్రి పూట షూటింగ్‌ జరుపుకోవడానికి ప్రత్యేకంగా అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం నయనతార తాజాగా హైదరాబాద్ చేరుకుంది. తన చార్టెడ్ ఫ్లైట్ లో ఆమె హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడింది. కరోనా పరిస్థితుల కారణంగా కొన్నాళ్లు రజనీకాంత్ ఆరోగ్యం బాగోక కొన్నాళ్ళు వాయిదా పడుతూ వచ్చింది.

Nayanthara Reaches Hyderabad on a chartered flight for rajinikanths Annaatthe shoot

అయితే రజనీకాంత్ కోలుకున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించాలని యూనిట్ భావిస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో ఆమె లేడీ బిల్లాను తలపిస్తోందని అభిమానులు సంబర పడుతున్నారు. ఇక కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న అన్నాత్తేలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా నవంబర్‌ 4, 2021 దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Nayanthara Reaches Hyderabad on a chartered flight for rajinikanths Annaatthe shoot

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X