‘గజిని చేసినందుకు బాధపడుతున్నా’.. మోసం జరిగిందంటూ.. నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది. ఇప్పటివరకు తన కెరియర్లో నయనతార 75కు పైగా చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం చిత్ర పరిశ్రమlo స్టార్ హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగు చిత్రాలతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆమె కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకుంది. అయితే నయనతార కు సూర్య సరసన నటించిన గజినీ చిత్రం అస్సలు నచ్చదంట. అందుకు ఒక కారణం కూడా తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే..
సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా..
నయనతార సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుని హీరోయిన్ గాను గుర్తింపు పొందింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోల సరసన దీటైన పర్ఫామెన్స్ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ము లేపుతుంది. లేడీ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ తో ఇప్పటికీ భారీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

20 ఏళ్ల కింద సెన్సేషన్ గా గజిని..
కోలీవుడ్ స్టార్ హీరో కెరియర్ లో ఉత్తమ చిత్రం గా నిలిచింది గజిని. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించడం విశేషం. బ్యూటిఫుల్ హీరోయిన్ ఆసిన్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా నయనతార నటించింది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేశారు. తమిళం తో పాటు తెలుగులోనూ 20 ఏళ్ల కింద భారీ విజయాన్ని సాధించింది. 9 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు చేసి కమర్షియల్ గాను హిట్ అయింది. ఈ చిత్రం తర్వాత నయనతారకు కూడా మంచి క్రేజీ దక్కింది. క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ వచ్చింది.
గజని చిత్రంపై నయనతార ఒపీనియన్
గజని చిత్రంలో ఇద్దరి హీరోయిన్ ఉండడంతో నయనతారకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఆ చిత్రంలో నా పాత్రను చూపించిన తీరు ఇప్పటికే నచ్చదని నయనతార వెల్లడించింది. అసలు తన పాత్రకు ప్రాధాన్యతే లేదని అభిప్రాయపడింది. ఆ సినిమాలో ఎందుకు నటించానని అనుకుంటున్నట్టుగా చెప్పింది. గతంలో నయనతార చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
నయనతార రాబోయే చిత్రాలు..
ప్రస్తుతం నయనతార తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయినప్పటికీ బిగ్ ప్రాజెక్టులో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. చివరిగా బాలీవుడ్ చిత్రం జవాన్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా 157 చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మరోవైపు యష్ టాక్సిక్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళం, మలయాళం భాషల్లోనూ రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











