‘100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా.. ఆ హీరోతో చేయను’.. నయన్ కామెంట్స్ తో రచ్చ
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా హీరోయిన్ నయనతారకు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. రెండు దశబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో తనకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సౌత్ లో స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. తెలుగు, తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేసింది. అయితే కోలీవుడ్ లో మాత్రం ఓ హీరోతో కలిసి నటించేందుకు నయనతార ఏమాత్రం ఒప్పుకోలేదంట. పైగా ఆయనను అవమానించిందని తెలుస్తోంది. ఇందుకు కారణం నయనతార తాజాగా మాట్లాడిన మాటలే అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
నయనతారను సంప్రదించిన తమిళ హీరో ఎవరు?
నయనతారకు సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో అంచెలంచెలుగా ఎదిగింది. భారీ హిట్స్ ను అందుకొని ఏకంగా స్టార్ హీరోలకు ధీటుగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ కారణంగా నయనతారను 2022లో వచ్చిన 'ది లెజెండ్' మూవీలో నటించమని బిజినెస్ మెన్, శర్వానన్ అడిగారంట. ఆయనకు సినిమా మీద ఉన్న ఆసక్తితో లెజెండ్ అనే చిత్రాన్ని చేశారు. ఆ సినిమాలో నయనతారను నటించమని అడిగితే మొహం మీదనే రిజెక్ట్ చేసిందంట.

నయనతార రియాక్షన్ ఇదే..
శర్వానన్ నటించిన తమిళ చిత్రం లెజెండ్ సినిమాపై ఇటీవల నయనతార స్పందించింది. తనకు 100 కోట్ల పారితోషికం ఇచ్చినా కూడా ఆ సినిమాలో నటించే దాన్ని కాదని చెప్పడం ఆసక్తికరంగా మారింది. కొన్ని విషయాల్లో డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వనని నయనతార అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే నయనతార అభిప్రాయాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఆమె సినిమా చేయకపోయినా పర్లేదు గానీ.. 100 కోట్లు ఇచ్చినా చేయనని చెప్పి ఆ నటుడిని విమర్శించడం సరికాదని అంటున్నారు. మరోవైపు కొన్ని డబ్బులతో కొనలేమని నయనతార అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తమిళ లెజెండ్ సినిమా వివరాలు..
బిజినెస్ మెన్ డాక్టర్ శర్వానన్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ లెజెండ్ సినిమా 2022లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా జంటగా నటించింది. 2022 జూలై 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నెగెటివ్ రివ్యూను అందుకుంది. ఇక ఈ చిత్రానికి హరీశ్ జయరాజ్ సంగీతం అందించడం విశేషం. రూ.100 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించి ఈ సినిమాను తీయడం విశేషం.
నయనతార నెక్ట్స్ మూవీస్..
ఇక నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా157 చిత్రంలో నటిస్తోంది. అలాగే కేజీఎఫ్ స్టార్ యష్ నెక్ట్స్ ఫిల్మ్ టాక్సిక్ లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవే గాక డియర్ స్టూడెంట్స్, మన్నంగట్టి సిన్స్ 1960, ఎంఎంఎంఎన్, మూక్తి అమ్మాన్ 2, హి, రాక్కాయే వంటి అర డజన్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. చివరిగా జవాన్ చిత్రంతో బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుంచి మరింత బిజీ అయ్యింది.


Click it and Unblock the Notifications











