Nayanthara Remuneration: టాక్సిక్‌కి నయనతార రెమ్యునరేషన్.. లేడీ సూపర్‌స్టార్ పారితోషికం ఎన్ని కోట్లంటే?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు నయనతార. ప్రతి సినిమాకు వైవిధ్యమైన నటనతో పాటు భారీ ఫ్యాన్స్ బేస్‌తో హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు. 20 ఏళ్లకు పైగా కెరీర్‌ను పూర్తి చేసుకుని ఇప్పటికీ నెంబర్‌వన్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న నయన్.. మరో హిట్‌పై కన్నేశారు. కన్నడ సూపర్‌స్టార్ యష్ హీరోగా వస్తోన్న టాక్సిక్‌లో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ మార్చి 19న విడుదల కానున్న నేపథ్యంలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అనేది హాట్ టాపిక్‌గా మారింది. అన్నింటిలోకి ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం పారితోషికంగా నయనతార ఎంత అందుకున్నారు? అనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే..

టాక్సిక్‌లో గంగగా నయనతార
ప్రస్తుతం నయనతార తమిళంలో మూకుతి అమ్మన్ 2, మన్నన్‌గట్టి సిన్స్ 1960, హాయ్, రక్కాయేతో పాటు తెలుగులో బాలకృష్ణ - గోపిచంద్ మలినేని మూవీలో నటిస్తున్నారు. మలయాళంలో పెట్రాయిట్, డియర్ స్టూడెంట్స్, పట్టులో నటిస్తున్నారు. వీటన్నింటిలోకి టాక్సిక్‌పైనే అందరి చూపు నెలకొంది. న్యూఇయర్ కానుకగా టాక్సిక్‌లో నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె గంగ అనే పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో స్టైలీష్‌గా కనిపిస్తున్నారు లేడీ సూపర్‌స్టార్. గన్ పట్టుకుని పవర్‌ఫుల్‌గా నడుచుకుంటూ వస్తూ అంచనాలు పెంచేశారు నయనతార.

Nayanthara Remuneration for Toxic Lady Surper Star is reportedly receiving a huge remuneration

టాక్సిక్ బడ్జెట్ ఎంత?
కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో టాక్సిక్‌ను నిర్మిస్తున్నారు. మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్‌, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఉగాది, రంజాన్, గుడిపర్వా వంటి పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టాక్సిక్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నయనతార కండీషన్స్
నటిగా నయనతారకు తిరుగులేదు.. అయితే ఆమె ప్రమోషన్స్‌కు రారని, ఇంటర్వ్యూలు ఇవ్వరని సినీ పెద్దలు సైతం బహిరంగంగానే విమర్శిస్తారు. తన షరతులు, ఇతర కండీషన్స్‌ను తనకు కథ చెప్పినప్పుడు, అగ్రిమెంట్ చేసుకునే సమయంలోనే దర్శక నిర్మాతలతో ప్రస్తావిస్తారు. వాటికి అంగీకరిస్తేనే సినిమాల విషయంలో ముందుకు వెళ్తారు. అయినప్పటికీ నయనతార డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార పారితోషికం విషయంలోనూ కరాఖండీగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడరు.

నయనతార రెమ్యునరేషన్ ఎంతంటే?
తాజాగా టాక్సిక్ విషయంలోనూ నయనతార భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి టాక్సిక్ కోసం నయనతార 18 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే దర్శక నిర్మాతలతో సంప్రదింపుల అనంతరం చివరికి 12 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకునేందుకు నయనతార అంగీకరించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: nayanthara toxic yash
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X