Nayanthara : నయనతార సంచలన నిర్ణయం... అలా పిలవొద్దంటూ విజ్ఞప్తి.. భగ్గుమంటున్న స్టార్ హీరోయిన్!

దక్షిణాదిలో సూపర్ స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంది హీరోయిన్ నయనతార. రెండు దశబ్దాలుగా సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ సీనియర్ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. స్టార్ ఇమేజ్ దక్కించుకోవడంతో ఆమె సినిమాలకు మొదటి రోజు థియేటర్లలో పక్కాగా హౌజ్ ఫుల్ అవుతుంది. మరోవైపు తెలుగు, తమిళంలో విభిన్న పాత్రల్లో, స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. తన నటనతో ఆడియెన్స్ ను అరలించడమే కాకుండా తన అభిమానులుగానూ మార్చుకుంది.

నయనతారకు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె హీరోలు తీసుకునేంత రెమ్యునరేషనే అందుకుంటుంది. మినిమ్ 5 నుంచి 10 కోట్ల మధ్యలో ప్రతి సినిమాకు ఛార్జ్ చేస్తుంటుంది. రీసెంట్ గానే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుఖ్ సరసన 'జవాన్'లో నటించి మెప్పించింది. ఇంత క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీకీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును ప్రదానం చేసింది. అయితే తాజాగా తనకు ఉన్న ట్యాగ్ లైన్ పైన షాకింగ్ కామెంట్స్ చేసింది.

Nayanthara Requested People to don t call her like this Here is Heroine Sensational Comments

సోషల్ మీడియాలో ఆమెకున్న 'లేడీ సూపర్ స్టార్' బిరుదుపై ఆసక్తికరంగా స్పందించింది నయనతార. ఈ సందర్బంగా ఆమె చెప్పిన దాన ప్రకారం.. 'నన్ను ఎంతగానో ప్రేమించే అభిమానులు లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నాకు ఆనందంగానే ఉంది. కానీ నయనతార అని పిలిస్తేనే నా హృదయానికి సంతోషంగా ఉంటుంది. నయనతార పేరు నటిగానే కాకుండా నా వ్యక్తిత్వాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. కష్టనష్ట నమయాల్లో, విజయాల్లో పరాజయాల్లో నాకు మీరంతా ఎంతో అండగా నిలిచారు.

కానీ లేడీ సూపర్ స్టార్ అని మాత్రం పిలవొద్దు ప్లీజ్. లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు వెలకట్టలేనిది... పైగా వాటివల్ల కంఫర్ట్ గా ఉండలేము. అలాగే నన్ను నయనతార అని పిలిస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక సినిమాను సెలబ్రేట్ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిద్దాం'. అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ రోజుల్లో తమకు స్థాయికి మించి ట్యాగ్ లైన్ పెట్టుకున్న తారలను అందరూ చూసే ఉంటారు. కానీ అర్హత ఉండి కూడా లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవొద్దు అని నయనతార చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇంతకీ ఎందుకిలా మాట్లాడిందనేది చర్చనీయాంశమైంది.

Nayanthara Requested People to don t call her like this Here is Heroine Sensational Comments

ఇక నయనతార 2022లో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. ఆ కొద్ది నెలలకే సరోగసీ ద్వారా నయనతారా ఇద్దరు పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం నయనతార చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. టాక్సిక్, డియర్ స్టూడెంట్స్, టెస్ట్ వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తూ ఉంది. అరడజన్ కు పైగా సినిమాలు నయనతార చేతిలో ఉన్నాయి. మలయాళం, తమిళం, కన్నడలో యమా జోరుగా సినిమాలు చేస్తోంది నయనతార. ఇక తెలుగులో చివరిగా మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది.

More from Filmibeat

Read more about: nayanthara tollywood actress
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X