నయనతారకు ఏడోసారి.. షాక్ మీద షాక్.. జాతకం మారేనా?

Recommended Video

Actress Nayanthara's Kolaiyuthir Kaalam Movie Gets Postponed Again || Filmibeat Telugu

దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్న అందాల భామ నయనతార సినిమా కష్టాల నుంచి బయటపడే పరిస్థితి కనిపిచండం లేదు. ఆమె నటించిన చిత్రం వరుస వాయిదాలకు గురికావడం అభిమానులకు షాకిస్తుంది. అంతేకాకుండా సినిమా విడుదలవుతుందా? లేదా అనే అంశం ప్రస్తుతం తమిళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో నయనతార తదుపరి చిత్రంపై కూడా క్లారిటీ కనిపించడం లేదు. వివరాల్లోకి వెళితే..

ఏడోసారి విడుదల వాయిదా

ఏడోసారి విడుదల వాయిదా

నయనతార నటించిన కొలైయుతీర్ కాలమ్ సినిమా చాలా రోజులుగా విడుదలకు సిద్ధంగా ఉంది. పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 1వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఆగస్టు 1 తేదీన కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. అయితే ఇలా రిలీజ్ వాయిదా పడటం ఇది ఏడోసారి. అయితే రిలీజ్ వాయిదా వెనుక అసలు కారణాలు బయటకు రాకపోవడం సస్సెన్స్‌గా మారింది.

రిలీజ్ వాయిదాకు అసలు కారణం

రిలీజ్ వాయిదాకు అసలు కారణం

కొలైయుతీర్ కాలమ్ సినిమాకు బిల్లా 2 ఫేమ్ దర్శకుడు చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సస్సెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ఖామోషీ జూన్ 14 తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే హిందీలో సినిమా ఫ్లాప్ కావడంతోనే విడుదలకు అడ్డంకిగా మారిందనే మాట వినిపిస్తున్నది. తాజా వాయిదాతో ఇకముందైనా విడుదల అవుతుందా అనే మాట వినిపిస్తున్నది.

నయనతార మూవీపై భారీగా

నయనతార మూవీపై భారీగా

కొలైయుతీర్ కాలమ్ టైటిల్ ప్రముఖ కథా రచయిత సుజాత రాసిన పుస్తకం పేరును ఈ సినిమాకు పెట్టారు. అయితే ఈ సినిమా ఆయన రాసిన పుస్తకం ఆధారంగా రూపొందలేదనే విషయాన్ని నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ప్రతాప్ పోతన్, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు. కొలమావు కోకిల, ఇమ్మైకా నోడిగల్ సినిమాల విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నయనతార కెరీర్‌పరంగా

నయనతార కెరీర్‌పరంగా

ఇక నయనతార విషయానికి వస్తే, చిరంజీవి నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నది. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి పాత్రలో నటిస్తున్న చిరంజీవికి భార్యగా నయనతార కనిపించబోతున్నది. తమిళంలో విజయ్ సరసన బిజిల్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నది. సైరా అక్టోబర్‌లో, విజయ్ బిజిల్ చిత్రం దివాళీకి రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X