చిరంజీవి మూవీకి ప్రమోషన్స్.. తమిళ హీరోలు టమోటా చట్నీలా కనిపిస్తున్నారా.. నయనతారపై దారుణంగా ట్రోలింగ్

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా అన్ని చోట్లా మేల్ డామినేషనే కనిపిస్తుంది. ప్రత్యేకించి ప్రతి చోటా హీరోలదే డామినేషన్.. కథను, హీరోయిన్‌ని, ఇతర టెక్నీషియన్స్‌ని సెలెక్ట్ చేసేది, వాటికి ఆమోదముద్ర వేసేది హీరోలే. అలాంటి చోట హీరోయిన్ల పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సక్సెస్ ట్రాక్‌కి తోడు, హీరోల కరుణా కటాక్షాలు ఉన్నంత వరకే రాణించగలరు. అలాంటి చోట హీరోలకే ముచ్చెమటలు పట్టిస్తూ దూసుకెళ్తున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార.

ఒకానొక దశలో కెరీర్‌లో ఎదురుదెబ్బలు, లవ్ ఫెయిల్యూర్స్, ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడి తన పేరునే ఓ బ్రాండ్‌గా మార్చారు నయన్. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌లలో ఒకరిగా నయనతార వెలుగొందుతున్నారు. ఎంత పెద్ద హీరోలు అయినా సరే ఆమె కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆమె స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాదు.... ఇప్పటికీ నెంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందడం మామూలు విషయం కాదు. అలాంటి అసాధ్యాన్ని తన ప్రతిభతో సుసాధ్యం చేశారు నయనతార.

Nayanthara s Promotions for Mana Shankara Vara Prasad Garu Triggered Kollywood Backlash

ప్రస్తుతం నయనతార డైరీ అస్సలు ఖాళీ లేదు.. దాదాపు డజను సినిమాలలో ఆమె నటిస్తున్నారు. మన శంకర వరప్రసాద్‌ గారుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనున్నారు లేడీ సూపర్‌స్టర్. దీనితో పాటు టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, మూకుతి అమ్మన్ 2, మన్నన్‌గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, పెట్రియాట్, హాయ్, రాక్కయై, NBK 111 సినిమాలలో నయనతార నటిస్తున్నారు. అయితే ఎంత పెద్ద సూపర్‌స్టార్ అయినా కొన్ని మచ్చలు సహజం. అలాగే నయన్ విషయంలో ఎక్కువగా వినిపించే పేరు ప్రమోషన్స్‌కు హాజరుకాకపోవడం. తనతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలోనే తాను ప్రమోషన్స్‌కు దూరంగా ఉండేలా స్పెషల్ క్లాజ్‌ చూపిస్తారు. దానికి ఒప్పుకుంటేనే సినిమాకు నయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎంత పెద్ద స్టార్ సినిమాలో నటించినా, దిగ్గజ దర్శకులు డైరెక్ట్ చేసినా తాను ఇంతేనని తేల్చిచెప్పారు.

అలాంటిది మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా విషయంలో మాత్రం నయనతార మనసు మార్చుకున్నట్లుగా కనిపించింది. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పుడు హీరోయిన్ ఎవరు? అన్నదానిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే అనిల్ రావిపూడితో నయనతార చేసిన స్పెషల్ వీడియోతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇదే సమయంలో ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతారని అనిల్ ఎలా ఒప్పించారని విశ్లేషకులు ఆశ్చర్యపోయారు.

తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మరోసారి షాకిచ్చారు నయనతార. న్యూ ఇయర్ సందర్భంగా ఆమె చేసిన ప్రమోషనల్ వీడియో వైరల్ అయ్యింది. అందులో నయనతార షూటింగ్ ముగించుకుని వెళ్తూ .. అనిల్ రావిపూడికి ఎదురవుతుంది. షూటింగ్ అయిపోయింది మరి ప్రమోషన్స్ ఏం లేవా? అని నయన్ అడగటంతో అనిల్ షాక్ అవుతాడు. మీరు ప్రమోషన్స్‌కు ఒప్పుకోవడమే పెద్ద ప్రమోషన్... మీరు జస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే చాలని అనిల్ చెబుతారు. దాంతో చిరంజీవి మేనరిజంతో కెమెరా కొంచెం టర్నింగ్ ఇచ్చుకోండి అనే డైలాగ్ చెప్పి జనవరి 12న మన సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతోందని నయనతార చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతేకాదు.. అది తమిళ ప్రేక్షకులకు కంటగింపుగా మారింది. కోలీవుడ్‌లో ఎంత పెద్ద స్టార్ హీరోలతో నటించినా, చివరికి తను స్వయంగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ప్రమోషన్స్‌కు రాని నయనతార... తెలుగు సినిమాల కోసం ఇలా ముందుకు రావడం ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు. తమిళ సినిమాలు మీకు టమాటా చట్నీలా చులకనగా కనిపిస్తున్నాయా? తెలుగు సినిమా మీకు అంత ఎక్కువైపోయిందా? నో ప్రమోషన్స్ పాలసీ నిబంధనను అతిక్రమిస్తున్నారంటూ నయనతారపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు. అయితే దీనిని నయనతార ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. ప్రమోషన్స్‌లో పాల్గొనాలా? వద్దా? అనేది పూర్తిగా నటి ఇష్టం. ఆమె ప్రమోషనల్ షూట్స్‌లో పాల్గొంటుంది. కానీ బహిరంగ కార్యక్రమాలకు మాత్రం హాజరకాదని ట్వీట్స్ పెడుతున్నారు. మరి తమిళుల నిరసన సెగపై నయనతార ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X