విఘ్నేష్‌తో ఉన్నా ఆయన జ్ఞాపకాలు మరువలేకపోతున్నా: నయన్ షాకింగ్ కామెంట్స్

By Manoj

దక్షిణ భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో తన హవాను కొనసాగిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. భాషతో సంబంధం లేకుండా ఆమె వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి నటిస్తూ తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకుంటోంది. నయనతారకు ఉన్న క్రేజ్‌తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. దీంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచేస్తోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కగా నడిపించుకునేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇలాంటి సమయంలో నయనతార తన పాత ప్రియుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరి గురించి ఏం మాట్లాడింది? వివరాల్లోకి వెళితే..

రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో మెప్పించింది

రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో మెప్పించింది

నయనతార ఈ మధ్య రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి మెప్పించింది. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' కాగా, మరొకటి ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్'. ఈ రెండింటిలోనూ ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలు మాత్రమే కాదు.. ఇతర భాషల్లోనూ ఆమె మంచి మంచి సినిమాలు చేసింది.

ప్రియుడితో కలిసి హల్‌చల్

ప్రియుడితో కలిసి హల్‌చల్

నయన్.. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో దాదాపు ఐదేళ్లుగా డేటింగ్‌ను కొనసాగిస్తోంది. విఘ్నేష్ తనకు కాబోయే భర్త అని నయన్ ప్రకటించేశారు కూడా. ఇద్దరూ తరచూ విహారయాత్రలకు వెళుతున్నారు. అక్కడి ఫొటోలను విఘ్నేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల విఘ్నేష్ పుట్టినరోజు సందర్భంగా నయన్ ఘనంగా పార్టీ కూడా ఏర్పాటు చేశారు.

అప్పుడు కూడా అలాగే

అప్పుడు కూడా అలాగే

నయనతార గతంలోనూ ఇద్దరు సినీ ప్రముఖులతో ప్రేమాయణం కొనసాగించింది. వారిలో ఒకరు ప్రముఖ హీరో కాగా, మరొకరు యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా. వీళ్లిద్దరితో డేటింగ్‌లో ఉన్న సమయంలోనూ ఆమె తరచూ మీడియా కంట పడేది. వీళ్లపై ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. దీంతో నయనతార తరచూ హాట్ టాపిక్ అవుతూ ఉండేది.

పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది

పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది

దక్షిణ భారతదేశంలోని ఓ ఇండస్ట్రీ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు ప్రభుదేవా. ఈయనతో నయన్ ప్రేమాయణం సాగిస్తుందని తెలిసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అప్పుడు నయన్ పెళ్లి వరకూ వెళ్లింది. కొద్ది రోజుల్లో వివాహం చేసుకుంటారు అనగా.. ఈ జంట విడిపోయింది. దీనికి సంబంధించిన కారణాలను మాత్రం వాళ్లిరువురూ చెప్పలేదు.

Recommended Video

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
 ఆయన జ్ఞాపకాలు మరువలేకపోతున్నా

ఆయన జ్ఞాపకాలు మరువలేకపోతున్నా


ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రభుదేవా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది నయన్. ‘ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత నా మనసు ముక్కలైంది. ఆ సమయంలో ఒంటరిగా ఎంతో కుమిలిపోయా. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. అంతేందుకు విఘ్నేష్‌తో ఉన్నా ఆయన జ్ఞాపకాలు మరువలేకపోతున్నా' అని ఆవేదన వ్యక్తం చేసిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X